Janam Muchata – Voice of the People | Telugu News Platformమంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లోకి వలసల పర్వం…మునిగేపల్లి సర్పంచ్‌, ఐదుగురు… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 12 Aug 2026, 3:26 am
Date of Publish : 14 May 2026, 10:21 am  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 211 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లోకి వలసల పర్వం…మునిగేపల్లి సర్పంచ్‌, ఐదుగురు వార్డు సభ్యుల చేరిక !!

మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లోకి వలసల పర్వం…మునిగేపల్లి సర్పంచ్‌, ఐదుగురు వార్డు సభ్యుల చేరిక !!

ఖమ్మం : పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలో అధికార పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. మునిగేపల్లి సర్పంచ్ గంగా స్రవంతి తన అనుచర వర్గంతో కలిసి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖమ్మంలోని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది…..

​ఐదు నెలల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్‌గా గెలుపొందిన గంగా స్రవంతి, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. సర్పంచ్‌తో పాటు ఆమె వెన్నంటి గెలిచిన ఐదుగురు వార్డు సభ్యులు, గ్రామ ముఖ్య నాయకులు, వివిధ పార్టీలకు చెందిన సుమారు 50 కుటుంబాల వారు మంత్రి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు….

​ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు జొన్నలగడ్డ రవి కుమార్,పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు…..