తెలంగాణ/ఖమ్మం జిల్లా:
ఖమ్మం సిటీ:నగరంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ప్రత్యేక చొరవతో మంజూరైన మొత్తం ₹20,62,000 విలువైన చెక్కులను మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య,ఇతర ముఖ్య నాయకులతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు,ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు భరోసా కల్పించేలా, బిఆర్ఎస్ కార్యాలయం వేదికగా ఆయన నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు….
లబ్ధిదారులకు చెక్కులను అందజేస్తున్న ఎమ్మెల్సీ తాత మధుసూదన్...
అనంతరం ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ.. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో సీఎంఆర్ఎఫ్ పంపిణీ ఒక పండుగలా సాగేదని గుర్తు చేశారు. వేలాది మంది పేదలకు లక్షలాది రూపాయల చెక్కులు అందించి ప్రాణదాతలుగా నిలిచామని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ప్రస్తుత ప్రభుత్వంలో ఎంతటి తీవ్రమైన జబ్బుకైనా, ఎంత ఖర్చయినా సరే.. సాయాన్ని కేవలం రూ. 40 వేలకే పరిమితం చేయడం దారుణం. దీనివల్ల నిరుపేద కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని,నిరుపేదలకు నిజమైన న్యాయం జరగాలంటే మళ్లీ తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వం రావాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం లబ్ధిదారులతో ఆత్మీయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు…..
లబ్ధిదారులకు చెక్కులను అందజేస్తున్న ఎమ్మెల్సీ తాత మధుసూదన్...
ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, పగడాల నాగరాజు, నాయకులు ముత్యాల వెంకటప్పారావు, పొట్ల ప్రసాద్, మహమ్మద్ రఫీ, పేరం వెంకటేశ్వర్లు, బలుసు మురళీకృష్ణ, లింగనబోయిన సతీష్, లెనిన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు….
లబ్ధిదారులతో ఎమ్మెల్సీ తాత మధుసూదన్...
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456