తెలంగాణ/ఖమ్మం జిల్లా:
ఖమ్మం జిల్లా: ఎండనకా...వాననక రెక్కల కష్టం చేసి పంటను పండించిన మొక్కజొన్న రైతుకు 'రవాణా' కష్టాలు కన్నీళ్లు మిగిలిస్తున్నాయి. ప్రభుత్వ మద్దతు ధరతో మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఆదుకుంటాయని ఆశించిన అన్నదాతకు, రవాణా కాంట్రాక్టర్ల సిండికేట్ రూపంలో పెద్ద గండం ఎదురవుతోంది. ఖమ్మం నగరంలోని గాంధీ చౌక్ కేంద్రంగా సాగుతున్న.... ఈ అక్రమ 'ట్రాన్స్‌పోర్ట్ దందా' వెనుక కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో రైతులపట్ల మార్క్ ఫెడ్ అధికారులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు గురవుతుంది,మంత్రి తుమ్మల జోక్యం చేసుకుని అక్రమాలకు
పాల్పడుతున్న సదరు కాంట్రాక్టర్ తో పాటు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోకపోతే రైతులను నుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కునే పరిస్థితులు వస్తాయని పలువురు రైతులు వ్యాఖ్యానిస్తున్నారు....
లారీల కృత్రిమ కొరత.. కోట్లలో దోపిడీ!
మార్కెట్‌లో సరిపడా వాహనాలు అందుబాటులో ఉన్నప్పటికీ, కాంట్రాక్టర్లు కావాలనే 'కృత్రిమ కొరత'ను సృష్టిస్తున్నారు. లారీలు లేవనే నెపంతో కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న బస్తాలను రోజుల తరబడి నిలిపివేస్తున్నారు. అదును చూసి రైతును ఇబ్బంది పెట్టి, అదనపు పైకం వసూలు చేయడమే వీరి ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.ప్రభుత్వం నిర్ణయించిన రవాణా ఛార్జీలు కాకుండా, 'లోడింగ్ చార్జీలు', 'వెహికల్ అడ్జస్ట్‌మెంట్' పేరుతో ఒక్కో బస్తాకు రూ. 50 వరకు రైతుల నుండి వసూలు చేస్తున్నారు. ఎవరైతే కాంట్రాక్టర్ అడిగిన అదనపు మొత్తం ఇస్తారో, వారికే లారీలను కేటాయిస్తున్నారు. లేని పక్షంలో "నో వెహికల్" అంటూ రైతులను రోజుల తరబడి వేచి చూసేలా చేస్తున్నారు....
గిట్టుబాటు ధర ఉన్నా రైతుకు దక్కని ఫలం....
పండించిన మొక్కజొన్నలకు బహిరంగ మార్కెట్ కంటే మార్క్‌ఫెడ్ ద్వారా లభించే ధర మెరుగ్గా ఉందని రైతులు సంబరపడ్డారు. కానీ, ఇక్కడ రవాణా పేరుతో జరుగుతున్న దోపిడీ వల్ల రైతు నికరంగా పొందే లాభం ఆవిరైపోతోంది. రవాణా ఖర్చులకే సగానికి పైగా సొమ్ము ధారపోయాల్సి వస్తోందని తిరుమలాయపాలెంనకు చెంది ఓ రైతు తన "జనం ముచ్చట" కుఆవేదన వ్యక్తం చేశాడు....ఈ మొత్తం వ్యవహారంలో ఖమ్మం గాంధీ చౌక్ ప్రాంతానికి చెందిన ఒక ప్రముఖ ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్,గ్రైన్ మార్కెట్ పాలక వర్గానికి చెందిన కొంతమంది అధికార పార్టీ నాయకుల అండదండలతో గత కొంతకాలంగా ఈ అక్రమ దందాను ఏదెచ్చగా నడిపిస్తున్నట్లు సమాచారం.ఇంత జరుగుతున్న మార్క్ ఫెడ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం ఈ అక్రమ కార్యకలాపాలకు మరింత ఊతమిచ్చేలా ఉందని రైతులు ఆరోపిస్తున్నారు....
మొక్కజొన్న రైతుల ఆవేదన....
ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్నలకు బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధర ఉందని "మార్క్ ఫెడ్" దగ్గరకు వస్తే,
అదనపు ఛార్జీల పేరుతో కాంట్రాక్టర్లు మమ్మల్ని నిలువు దోపిడీ చేస్తున్నారని, ఒక్కో బస్తాకి అదనంగా యాభై రూపాయలు చెల్లిస్తేనే లారీ పంపిస్తామంటున్నాని,అప్పులు తెచ్చి పంట పండిస్తే, ఇప్పుడు రవాణా పేరుతో కాంట్రాక్టర్లు మా రక్తం తాగుతున్నారని చింతకాని మండలానికి చెందిన ఓ రైతు కన్నీటి పర్యంతం అయ్యాడు...మార్క్‌ఫెడ్ ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్ ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నా, ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి.రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెంటనే స్పందించి ఈ రవాణా మాఫియాపై తక్షణమే విచారణ జరిపి, రైతులకు న్యాయం చేయాలని, నిబంధనల ప్రకారం లారీలను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు అంతే కాకుండా అన్నం పెట్టే రైతును అడ్డగోలుగా దోచుకునే ఈ ట్రాన్స్పోర్ట్ సిండికేట్ దెబ్బకు బక్క చిక్కుతున్న రైతును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని,ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం కళ్లు తెరిచి ఈ మాయాజాలాన్ని అరికట్టాలని రైతులు కోరుతున్నారు.....
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456