తెలంగాణ/హైదరాబాద్:
హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి (BRS) స్థాపించి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల నిర్వహించిన సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు మరియు టికెట్ ఆశించే నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో హడావుడి చేస్తూ, వాస్తవ రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేతలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.వర్చువల్ లోకం నుండి వాస్తవంలోకి రావాలని,సోషల్ మీడియానే ప్రపంచం అనుకుని భ్రమల్లో బతకవద్దని, సోషల్ మీడియాను ప్రచారానికి వాడుకోవాలే తప్ప, అందులోనే బతికేస్తామంటే రాజకీయాల్లో మనుగడ సాధ్యం కాదు" అని హెచ్చరించారు,కేవలం డిజిటల్ స్క్రీన్లకు పరిమితమైతే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం సాధ్యం కాదని కేసీఆర్ స్పష్టం చేశారు…..
సోషల్ మీడియాలో వ్యక్తిగత ఆడంబరాలు వద్దు !!
అదే విధంగా రాబోయే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై కూడా కేసీఆర్ స్పష్టత ఇచ్చారు, ప్రజాక్షేత్రంలో పట్టు ఉండి, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే వారికే వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కుతాయని ఆయన తేల్చి చెప్పారు.కొందరు నేతలు ప్రజా క్షేత్రంలో లేకుండా నేతలు తమ ఖరీదైన కార్లు,ఫ్యామిలీ ఫంక్షన్లు, డాన్సులను సోషల్ మీడియాలో ప్రదర్శిస్తూ ఆర్భాటం చేస్తున్నారని, ఇలాంటి చర్యలు ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతాయని కేసీఆర్ అసహనం వ్యక్తం చేసారు,సోషల్ మీడియానువ్యక్తిగత ప్రదర్శనలకు కాకుండా, ప్రభుత్వ వైఫల్యాలను ఎండకట్టడానికి మరియు పార్టీ చేసే మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అస్త్రంగా వాడుకోవాలని సూచించారు…..
2028 ఎన్నికలే లక్ష్యంగా కథన రంగంలోకి దిగండి !!
ఈ సందర్బంగా కొందరు నేతలకు కేసీఆర్ క్లాస్ పీకినట్లు తెలుస్తుంది,గత ఎన్నికల్లో సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పని చేయని వారు ఓటమి పాలైన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు,రాబోయే 2028 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుండే కార్య రంగంలోకి దిగాలని, ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకోవాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ హెచ్చరికతో టికెట్ ఆశించే నేతలంతా ఇప్పుడు సోషల్ మీడియాను వదిలి నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు……
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456