Janam Muchata – Voice of the People | Telugu News Platform › పేద ప్రజల దాహార్తిని తీర్చే “చలివేంద్రం” ధ్వంసం చేయడం దుర్మార్గపు… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 ✈ in @ ✉
janammuchata.in 10 Oct 2026, 8:16 pm
Date of Publish : 02 May 2026, 4:52 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 628 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubnagar > Politics > Telangana

పేద ప్రజల దాహార్తిని తీర్చే “చలివేంద్రం” ధ్వంసం చేయడం దుర్మార్గపు చర్య!!

పేద ప్రజల దాహార్తిని తీర్చే “చలివేంద్రం” ధ్వంసం చేయడం దుర్మార్గపు చర్య!!

రాజకీయంగా కక్షలు, కార్పణ్యాలు ఉంటే రాజకీయంగా
తేల్చుకోవాలి కానీ మండుటెండల్లో పేద ప్రజల దాహార్తిని
తీర్చే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన "చలివేంద్రం"ధ్వంసం చేయడం దుర్మార్గపు చర్య.తాజాగా ఖమ్మం నగరంలో జరిగిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది…......నగరంలోని స్థానిక 20వ డివిజన్లో పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ధ్వంసం చేయడమే కాకుండా, నీటి కుండల్లో మూత్ర విసర్జన చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు….

ఈ సంఘటన యాదృచ్చికంగా జరిగింది కాదని దీని వెనుక
తన రాజకీయ ప్రత్యర్థుల కుట్ర ఉందని,గత కొంతకాలంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అసాంఘిక కార్యకలాపాలకు వత్తాసు పలడమే కాకుండా అడ్డగోలు సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారని స్థానిక కార్పొరేటర్ ఆరోపిస్తున్నారు.........ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తే ఒక నలుపు రంగు స్కార్పియో వాహనం అక్కడికి వచ్చి, ఇద్దరు వ్యక్తులు దిగినట్లు కనిపిస్తోందని.వారు చలివేంద్రం వద్ద ఉన్న ఫ్లెక్సీ బోర్డును ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయడమే కాకుండా ఆనవాళ్ళు దొరకకుండా ఆ ముక్కలను తిరిగి కారులో వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారని, ఈ ఘటన వెనుక నిత్యం ఓ యువ నాయకుని వెనుక తిరిగే అధికార పార్టీ నాయకుని హస్తం ఉన్నట్లు స్థానిక కార్పొరేటర్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు,రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక దిగజారుడు చర్యలు పాల్పడుతున్నారని,ప్రజాసేవ కార్యక్రమాలను అడ్డుకోవడానికి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు….