Janam Muchata – Voice of the People | Telugu News Platformఖమ్మం సిటి BRS పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా “మేడే”వేడుకలు !! › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 12 Aug 2026, 2:20 am
Date of Publish : 01 May 2026, 6:49 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 270 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

ఖమ్మం సిటి BRS పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా “మేడే”వేడుకలు !!

ఖమ్మం సిటి BRS పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా “మేడే”వేడుకలు !!

ఖమ్మం నగరంలో బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో "మేడే" వేడుకలు ఘనంగా జరిగాయి,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలోని రైతు బజార్ ఆటో అడ్డా వద్ద ఆటో యూనియన్ నాయకులు ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని కార్మిక జెండాను ఎగరవేశారు…..

ఈ సందర్భంగా ఆటో కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, మేడే రోజు ప్రపంచ కార్మికుల ఐక్యత, హక్కుల సాధనకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. కార్మికుల కష్టఫలితమే సమాజ అభివృద్ధికి మూలాధారమని, వారి శ్రమతోనే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని తెలిపారు.మేడే పుట్టుక కార్మికుల పోరాటాల ఫలితంగా వచ్చిన గొప్ప చారిత్రక దినమని,తెలంగాణ రాష్ట్రంలో కార్మిక సంక్షేమానికి గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందని,పలు సంక్షేమ పథకాల ద్వారా కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచిందని పేర్కొన్నారు,కార్మికుల హక్కులను కాపాడటం, వారికి సామాజిక భద్రత కల్పించడంలో ఈ నాటి కాంగ్రేస్ ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేశారు.బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పటికీ కార్మిక వర్గానికి అండగా నిలుస్తుందని,వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తుందని హామీ ఇచ్చారు…..

అనంతరం పాత మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా మాజీ డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం జెండా ఆవిష్కరించారు. అంతే కాకుండా రాపర్తి నగర్ కూరగాయల మార్కెట్ వద్ద మరియు బాబురావు పెట్రోల్ బంక్ ఎదురుగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పగడాల నాగరాజు జెండా ఆవిష్కరించారు. తదనంతరం పీఎస్ఆర్ రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి ప్రసాద్ జెండా ఆవిష్కరించారు….

ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ ఖమర్ గారు, కార్పొరేటర్ మక్బుల్ గారు, తోట రామారావు గారు, దండా జ్యోతి రెడ్డి గారు, బిక్కసాని జస్వంత్ ,మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు తాజుద్దీన్ గారు, మాజీ కౌన్సిలర్ మరియు మాజీ కార్పొరేటర్ కనకం భద్రయ్య గారు, దడాల రఘు, ఎర్ర అప్పారావు, షకీన్, మాటేటి కిరణ్, ఫిరోజ్,మున్నా,చోటు,మహేబుబ్,గాదే అనిల్, ఆరెంపుల వీరభద్రం, గొల్లపూడి రాంప్రసాద్, ఉస్మాన్, నెమలి కిషోర్, దండుగుల రాంబాబు, మోటె కుమార్, పొలే పొంగు వెంకట్, నల్లమోతు కోటయ్య, ఫణి కృష్ణ, కొల్లి విద్యాసాగర్, వుల్లోజు అంజి బాబు ,ఠాగూర్ ,స్వామి, నాగేశ్వరావు, దేవరకొండ నాగేశ్వరావు, పంగిలపల్లి శ్రీనివాస్, పిట్టల తిరుమల్, ఎడవెల్లి బిక్షం, కోడి వీరబాబు, అద్దంకి శివ, మాతంగి అనిల్, మిర్యాల రమేష్, మల్లేష్ యాదవ్, మెడబోయిన నగేష్ మరియు 44వ డివిజన్ నాయకులు కాల జానీ,జమీల్, అజాస్,సోహెల్,సాయి,జావీద్ ,జగ్గు ,జిల్లా శ్రీనివాసరావు.జానీ. పాషా.జిలాని. శంకర్. శివ. భద్రం. రవి నాయక్. రవి. వాళ్లేపు దేవా.మహమ్మద్.నాని. నరేందర్,నాగరాజు.మాధవి, శైలజ, కంచ పోగు అశోక్ బాబురావు పెట్రోల్ బంక్ సురేష్. నజీర్. సామీలు,గాంధీ చౌక్ గడ్డ మేస్త్రీలు జల్లి వెంకన్న. భద్రం,ఓల్డ్ మున్సిపాలిటీ నవీన్ తదితరులు పాల్గొన్నారు……