Janam Muchata – Voice of the People | Telugu News Platform“షిహాన్ అక్షర్” మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ‘ధీర’ సినిమా ప్రారంభం… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 12 Aug 2026, 3:46 am
Date of Publish : 29 Apr 2026, 10:10 am  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 247 💬 0
Latest News > Entertainment > Movie News

“షిహాన్ అక్షర్” మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ‘ధీర’ సినిమా ప్రారంభం !!

“షిహాన్ అక్షర్” మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ‘ధీర’ సినిమా ప్రారంభం !!

హైదరాబాద్:తెలుగు సినీ పరిశ్రమలో మరో విభిన్నమైన యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు శ్రీకారం చుట్టారు.యువ హీరో "అక్షర్"ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పూర్తి స్థాయి "మార్షల్ ఆర్ట్స్" చిత్రం ఇటీవల ఘనంగా పూజా ముహూర్తంతో ప్రారంభమైంది.ఈ చిత్రాన్ని పసుపులేటి గౌరీ శంకర్, గౌరీ శంకర్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా, స్వాక్షా పిక్చర్స్ సంయుక్తంగా భాగస్వామ్యం వహిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు గోపినాథ్ థోటా దర్శకత్వం వహిస్తున్నారు…

ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఎస్‌.ఎన్‌. నజీర్ ఇప్పటికే ఆధారం, ఖైదు వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు. అలాగే అక్షర్ తొలి చిత్రం ‘2వ గది’కి కూడా ఆయనే సంగీతం అందించారు.తన ప్రత్యేకమైన సౌండింగ్‌తో పాటు, అక్షర్‌కు సన్నిహితుడిగా ఉండటం ఈ ప్రాజెక్ట్‌కు మరింత బలం…..

ఈ చిత్రంతో హీరో అక్షర్‌కు ప్రత్యేకమైన బిరుదు లభించింది. ఆయనలో ఉన్న అసలైన మార్షల్ ఆర్ట్స్ ప్రతిభను గుర్తించి, దర్శకుడు గోపినాథ్ థోటా గారు అక్షర్‌ను “షిహాన్ అక్షర్”గా మార్చడం జరిగింది,మార్షల్ ఆర్ట్స్‌లో “షిహాన్” అనేది ఒక ఉన్నత స్థాయి గురువు/మాస్టర్‌కు ఇచ్చే గౌరవప్రదమైన బిరుదు. అదే భావాన్ని ప్రతిబింబించేలా ఈ పేరును ఎంపిక చేశారు…..

ఈ సినిమా కథను నేను అక్షర్ కోసం ప్రత్యేకంగా రాసుకున్నాను. ఆయనకు ఉన్న మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అవుతుంది.ఈ కథను ఒకేసారి హీరో గారికి మరియు నిర్మాత గౌరీ శంకర్ గారికి చెప్పాను, ఇద్దరికీ చాలా నచ్చింది.ఈ సినిమా కోసం అక్షర్ ఇంకా ప్రత్యేకంగా ఫైట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఆయనలో ఉన్న ఆ కట్టుదిట్టమైన స్కిల్ చూసి ఆయనను ‘షిహాన్ అక్షర్’గా పిలవాలని అనిపించింది,” అని దర్శకుడు తెలిపారు…..

నేను ఒక మార్షల్ ఆర్ట్స్ కోచ్‌ను. ఎన్నో మంది విద్యార్థులను ట్రైన్ చేసి, వారు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు.ఈ సినిమా సబ్జెక్ట్ నా ఫీల్డ్‌కు చెందినది కావడం, అలాగే హీరో అక్షర్‌తో ఉన్న మంచి అనుబంధం వల్ల ఈ ప్రాజెక్ట్‌ను వెంటనే ఓకే చెప్పాను,” అని నిర్మాత తెలిపారు……

“నేను చిన్నప్పటి నుండి మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానిని. ప్రస్తుతం నా మొదటి సినిమా ‘2వ గది’ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాంటి సమయంలోనే రెండో సినిమా అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది.మార్షల్ ఆర్ట్స్ సినిమా అంటే ఎలా ఉండాలో అలా ఈ చిత్రం ఉంటుంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది,” అని అక్షర్ తెలిపారు…..

మార్షల్ ఆర్ట్స్ ప్రధానంగా ఉన్న ఈ చిత్రంలో,హై వోల్టేజ్ ఫైట్స్,ప్రేమ కథ, భావోద్వేగాలు అన్నీ సమపాళ్లలో ఉండబోతున్న ఈ చిత్రానికి “ధీర” అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని చిత్ర బృందం తెలిపింది. “షిహాన్ అక్షర్”గా కొత్త అవతారంలో రానున్న ఈ ‘ధీర’ చిత్రం టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు పొందబోతోందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు….