Janam Muchata – Voice of the People | Telugu News Platformసీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లా వ్యవసాయ రంగానికి కీలక మలుపు:మంత్రి… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 13 Aug 2026, 6:40 am
Date of Publish : 22 Apr 2026, 11:06 am  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 382 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లా వ్యవసాయ రంగానికి కీలక మలుపు:మంత్రి తుమ్మల!!

సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లా వ్యవసాయ రంగానికి కీలక మలుపు:మంత్రి తుమ్మల!!

రాష్ట్రంలో సాగునీటి వనరుల అభివృద్ధికి కీలకంగా నిలుస్తున్న సీతారామ ప్రాజెక్టు పనులను రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు.ఈ రోజు ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తొట్టి పంపు నుండి ఖమ్మం జిల్లాలోని యాతాల కుంట వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర ఉన్న సీతారామ ప్రాజెక్టు కాలవ పనులను అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మరియు ఇరిగేషన్ అధికారులతో కలిసి మంత్రి తుమ్మల పరిశీలించారు,అనంతరం సత్తుపల్లి మండల పరిధిలోని యాతాల కుంట వద్ద జరుగుతున్న టన్నెల్ పనులను పరిశీలించి పనుల పురోగతిపై ఆరా తీశారు….

ఆ తరువాత అధికారులతో సమావేశమైన మంత్రి తుమ్మల
ప్రాజెక్టు పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, పూర్తి చేయడానికి అవసరమైన చర్యలపై అధికారులతో వివరంగా చర్చించారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, సీతారామ ప్రాజెక్టు పూర్తి అయితే ఖమ్మం జిల్లాలో లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడటంతో పాటు పంటల దిగుబడులు గణనీయంగా పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని వేగంగా పూర్తి చేయాలనే సంకల్పంతో ఉందని స్పష్టం చేశారు.ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం లేకుండా పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లకు మంత్రి ఆదేశించారు….

అంతే కాకుండా ప్రాజెక్టు పనులకు అవసరమైన నిధుల విడుదలలో ఎటువంటి అంతరాయం ఉండదని హామీ ఇచ్చారు. అలాగే, నాణ్యత ప్రమాణాలు పాటించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.స్థానిక రైతులతో కూడా మంత్రి మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలపై ఆశాభావం వ్యక్తం చేసిన రైతులు, పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు,సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లా వ్యవసాయ రంగానికి కీలక మలుపు తిప్పుతుందని
మంత్రి తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు…..