Janam Muchata – Voice of the People | Telugu News Platformవ్యక్తిగత జీవితాల్లోకి జొరబడుతున్న మీడియా: గోప్యతకు పొంచివున్న ముప్పు!! › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 13 Aug 2026, 5:38 am
Date of Publish : 19 Apr 2026, 10:52 am  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 243 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

వ్యక్తిగత జీవితాల్లోకి జొరబడుతున్న మీడియా: గోప్యతకు పొంచివున్న ముప్పు!!

వ్యక్తిగత జీవితాల్లోకి జొరబడుతున్న మీడియా: గోప్యతకు పొంచివున్న ముప్పు!!

ఇటీవలి కాలంలో మీడియా వ్యవస్థ తన అసలు ధ్యేయమైన సామాజిక సమస్యలను వెలుగులోకి తేవడం నుంచి కొంత మేర దూరమై, వ్యక్తిగత జీవితాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి,సమాజానికి ఉపయోగపడే అంశాలపై వార్తలు అందించడం మీడియా బాధ్యత కానీ కొంతమంది మీడియా ప్రతినిధులు వ్యక్తిగత వివాదాలు, కుటుంబ సమస్యలు, వ్యక్తుల అక్రమ సంబంధాలు వంటి విషయాలను ప్రధాన వార్తలుగా చూపిస్తూ గోప్యత హక్కులను ఉల్లంఘిస్తున్నాయి. ఈ ధోరణి వల్ల వ్యక్తుల వ్యక్తిగత గౌరవం దెబ్బతింటోందని సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు….

తాజాగా ఖమ్మం నగరంలో జరిగిన ఘటన మొత్తం ఖమ్మం జిల్లా మీడియాపై తీవ్ర ప్రభావం చూపుతుంది,ప్రెస్ రిపోర్టర్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గు పడాల్సిన పరిస్థితి దాపురించింది,మీడియా ముసుగులో ఆరుగురు మీడియా ప్రతినిధులు ఒక వ్యక్తి యొక్క మానసిక,శారీరక బలహీనతలను,అతని అక్రమ సంబంధాన్ని ఆసరగా తీసుకుని,అతన్ని బెదిరించి,మానసికంగా వేధింపులకు గురిచేసి దాదాపు అయిదు లక్షల రూపాయలు అక్రమంగా వసూళ్లు చేయడమే కాకుండా అవి చాలవన్నట్టు మరో ఐదు లక్షల కోసం డిమాండ్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది,ఈ సంఘటన జిల్లా ప్రజల్లో ఇటు మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది దీంతో మీడియా నైతిక విలువలు ఇంతగా దిగజారిపోయాయా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఇలాంటి సంఘటనలు మొత్తం మీడియాపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు…..

నిజానికి ఇలాంటి దురదృష్టకర సంఘటనల వలన సమాజంలో మీడియాపై ఉన్న గౌరవ మర్యాదలు మంటగలిసేపోయే ప్రమాదం ఉందని,పౌరుల యొక్క వ్యక్తిగత గోప్యతకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మీడియాపై ఉందని,మీడియా స్వేచ్ఛతో పాటు సమాజంపట్ల బాధ్యత కూడా సమానంగా ఉండాలని ,ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర పోషించినప్పటికీ, అది వ్యక్తిగత హక్కులను హరించే విధంగా ఉండకూడదని,సమాజ హితాన్ని కాపాడే దిశగా మీడియా అడుగులు ఉండాలని ప్రజలు,మేధావులు భావిస్తున్నారు……