Janam Muchata – Voice of the People | Telugu News Platformఅవినీతి సొమ్ముతో అందలాలు, “బర్త్ డే”ల పేరుతో తాయిలాలు!! › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 13 Aug 2026, 8:08 am
Date of Publish : 15 Apr 2026, 11:01 am  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 710 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

అవినీతి సొమ్ముతో అందలాలు, “బర్త్ డే”ల పేరుతో తాయిలాలు!!

అవినీతి సొమ్ముతో అందలాలు, “బర్త్ డే”ల పేరుతో తాయిలాలు!!

ఖమ్మం జిల్లా కార్మిక శాఖలో అవినీతి ఏ రేంజ్ లో
పెట్రేగి పోతుందో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో సాక్ష్యంగా నిలుస్తుంది,రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకొని అవినీతి పునాదుల మీద ఎలా అందలాలు ఎక్కాలనేది ఆ వీడియో ప్రత్యక్ష తార్కాణంగా నిలుస్తుంది,నిజమైన లేబర్ కార్డులు ఉండి మరణించిన కుటుంబ సభ్యుల ఇన్స్యూరెన్స్ కోసం "ఆలో లచ్చనా"అంటూ అభాగ్యులు అలమటించుకుంటూ ఆఫీసులు చుట్టూ తిరుగుతుంటే కొందరు లేబర్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు తప్పుడు ఇన్సూరెన్స్ క్లైములు చేసి కోట్ల రూపాయలు సంపాదించి"బర్త్ డే పార్టీ" ల పేరుతో చిందులు వేస్తున్నారు,ఒక నాడు కనీసం "బర్త్ డే విషెష్" చెప్పే నాధుడే లేని స్థాయి నుండి నేడు తన జన్మదిన వేడుకలకు మంత్రుల అనుచరులు,జిల్లా స్థాయి నాయకులు,మంత్రుల పిఏలు సైతం హాజరై శుభాకాంక్షలు తెలిపారంటేనే ఖమ్మం జిల్లా కార్మిక శాఖలో అవినీతి ఎంత వ్యవస్థీకృతంగా మారిందనే విషయం తేటతెల్లం అవుతుంది…..

తాజాగా ఖమ్మం నగరంలో జరిగిన కార్మిక శాఖ కార్యాలయంలోనీ ఒక లేబర్ ఇన్సూరెన్స్ ఏజెంట్ జన్మదిన వేడుకల వీడియో స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారి సంచలనం సృష్టిస్తుంది,ఈ వేడుకలకు మంత్రుల అనుచరులు,మంత్రులు పిఏలు, జిల్లా స్థాయి నాయకులు క్యూ కట్టడంతో చూపరులు ముక్కున వేలేసుకుంటున్నారు అసలే తప్పుడు ఇన్సూరెన్స్ క్లైముల్లో పీకల్లోతు అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న సదరు ఇన్సూరెన్స్ ఏజెంట్ జన్మదిన వేడుకలకు ఇంతమంది నాయకులు హాజరు కావడం, శాలువాలు కప్పడం,సన్మానాలు చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది,దీంతో లేబర్ ఇన్సూరెన్స్ మోసాల్లో రాజకీయ నాయకుల పాత్రపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి,ఈ వ్యవహారంలో కొందరు నాయకులు నేరుగా కాకపోయినా పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తుంది…..

ముఖ్యంగా, ఇన్సూరెన్స్ ఏజెంట్లు మరియు మధ్యవర్తులు పెద్ద స్థాయిలో నకిలీ క్లైములు చేయడానికి స్థానిక రాజకీయ నాయకుల సహకారం కీలకంగా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.తమ ప్రభావాన్ని ఉపయోగించి సంబంధిత శాఖల అధికారులను ప్రభావితం చేయడం, ఫైళ్లను వేగంగా ఆమోదింపజేయడం, అనుమానాస్పద కేసులను కూడా క్లియర్ చేయించడం వంటి చర్యలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి,కొన్ని సందర్భాల్లో, నకిలీ క్లైములకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చినప్పటికీ, అవి ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారని తెలుస్తోంది,ఒకవేల విషయం పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కి విచారణ మొదలైతే కేసులు కాకుండా చూడడం కోసం పోలీసు అధికారులపై రాజకీయ ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న కొందరు అధికారులు కూడా ఈ ఒత్తిడికి లోనై చర్యలు తీసుకోలేకపోతున్నారని సమాచారం….