Janam Muchata – Voice of the People | Telugu News Platformఖమ్మం నగరంలో ఏప్రిల్ 19న జరిగే మినీ ప్లీనరీని విజయవంతం… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 13 Aug 2026, 4:08 am
Date of Publish : 13 Apr 2026, 8:24 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 186 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

ఖమ్మం నగరంలో ఏప్రిల్ 19న జరిగే మినీ ప్లీనరీని విజయవంతం చేయాలి : బచ్చు విజయ్ కుమార్ !!

ఖమ్మం నగరంలో ఏప్రిల్ 19న జరిగే మినీ ప్లీనరీని విజయవంతం చేయాలి : బచ్చు విజయ్ కుమార్ !!

ఖమ్మం నగరంలోని మమత గ్రౌండ్స్‌లో ఈ నెల 19న సాయంత్రం 5:00 గంటలకు నిర్వహించనున్న మినీ పీనరీ సమావేశాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా బీసీ నాయకులు, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు,మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆహ్వానం మేరకు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో కార్యకర్తలంతా కలసి కట్టుగా పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు....

ఈ సందర్భంగా,ఖానాపురం హవేలీలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, ప్రతి డివిజన్ నుంచి కనీసం 100 మంది కార్యకర్తలు హాజరుకావాలని సూచించారు. అధికార పార్టీపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని, నగర కేంద్రంలో నిర్వహించే ఈ మినీ పీనరీ సమావేశం పార్టీ భవిష్యత్తుకు కీలకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.అలాగే, ఈ కార్యక్రమం విజయవంతానికి కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకుల అభిప్రాయాలను స్వీకరించారు….

ఈ సమావేశం లో కార్పొరేటర్లు నాగండ్ల కోటేశ్వర రావు, వలరాజు, జ్యోతి రెడ్డి, పార్టీ నాయకులు కొనకంచి ప్రసాద్, యూత్ అధ్యక్షులు కిషోర్, నాయకులు వాళ్లబినేని రామారావు, జాబిశెట్టి శ్రీనివాస్, దొంగల తీరిపతి రావు, యాకూబ్ పాషా, సద్దాం షేక్, దినేష్, పురం వెంకన్న, సురేష్, మోహన్ వీరేందర్, కోటి, మదార్, రాజు,కొమరయ్య, తార, లక్ష్మణ్, నరసింహ రావు, వెంకన్న, గాంధీ, రమేష్, భీక్య, రమేష్, పొడిల నాగరాజు, బండ్ల నరసింహ రావు, వీరయ్య, వంగవీటి శ్రీనివాస్, మరగని సుదర్శన్, యర్రంశెట్టి రవి, రాజేష్, అచ్యుత రావు, కోటయ్య, రామనర్సయ్య, రఘు, భిక్షమ్, సతీష్, రమేష్,శ్రీనివాస్, జోగుపర్తి ప్రభాకర్, వలీ, నాగేశ్వర రావు, నగేష్, మాధవి, శైలజ, జ్యోతి, పాల్గొన్నారు….