Janam Muchata – Voice of the People | Telugu News Platformభర్త చేసిన తప్పుకు భార్యను చెట్టుకు కట్టేసి హింసించిన గ్రామస్తులు… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 13 Aug 2026, 6:41 am
Date of Publish : 09 Apr 2026, 8:28 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 395 💬 0
Andhra Pradesh > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Latest News > Politics > Telangana

భర్త చేసిన తప్పుకు భార్యను చెట్టుకు కట్టేసి హింసించిన గ్రామస్తులు !!

భర్త చేసిన తప్పుకు భార్యను చెట్టుకు కట్టేసి హింసించిన గ్రామస్తులు !!

సంగారెడ్డి జిల్లా,కంగ్టి మండలంలో ఓ గ్రామంలో అమానుషం చోటు చేసుకుంది,HMB ఫైనాన్స్ పేరుతో గ్రామానికి చెందిన పలువురి వద్ద డబ్బులు తీసుకొని ప్రభాకర్ అనే వ్యక్తి మోసగించి పారిపోయాడు,ఈ క్రమంలో తమని నీ భర్త మోసం చేశాడు అంటూ స్కూల్లో అంగన్ వాడీ టీచర్ గా పని చేస్తున్న వసంత కుమారి అనే మహిళను ఈడ్చుకొని వచ్చి గ్రామస్తులు చెట్టుకు కట్టేసి ఆమెను అందరూ చూస్తుండగా ఘోరంగా హింసించిన దారుణమైన సంఘటన జరిగింది….

కండ్ల ఎదురుగా అంత అమానవీయ సంఘటన జరుగుతున్న ఒక్కరు కూడా ప్రశ్నించలేదు,కనీసం ఆమె వయసును చూసైనా జనాలకు మనసు కరగలేదు,ఆమె భర్త తప్పుడు పని చేస్తే చేసి ఉండొచ్చు,చట్టపరంగా కేసులు పెట్టొచ్చు,అరెస్ట్ చేసి జైలుకు పంపించవచ్చు,లేదాఅతన్ని తీసుకొచ్చి చెట్టుకు కట్టేయొచ్చు కానీ అతని భార్య ఏం చేసింది,పెద్ద వయసుల్లో ఉన్న ఆమెను ఇలా చెట్టుకు కట్టేసి హింసిచించడం దారుణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు,ఈ అమానుష సంఘటనకు పాల్పడిన గ్రామస్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు…..