Janam Muchata – Voice of the People | Telugu News Platform › కేసీఆర్ నోట కవిత మాట- BRS పార్టీలో కవితకు సానుకూల… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 ✈ in @ ✉
janammuchata.in 12 Oct 2026, 1:58 am
Date of Publish : 08 Apr 2026, 2:18 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 259 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Karimnagar > Khammam > Politics > Telangana

కేసీఆర్ నోట కవిత మాట- BRS పార్టీలో కవితకు సానుకూల వాతావరణం!?

కేసీఆర్ నోట కవిత మాట- BRS పార్టీలో కవితకు సానుకూల వాతావరణం!?

గత కొంత కాలంగా బి.ఆర్.యస్ పార్టీపై ఒంటికాలు మీద లేస్తూ విమర్శలు గుప్పిస్తు,సొంత పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు తిరిగి బి.ఆర్.ఎస్ పార్టీలో సానుకూల వాతావరణం ఏర్పడ్డట్లు తెలుస్తుంది,తాజాగా కేరళ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
పాల్గొంటున్న మాట విదితమే.ఈ సందర్భంగా సీఎం. రేవంత్ రెడ్డి వివిధ సభల్లో చేస్తున్న వాగ్దానాలను ఉటంకిస్తూ సీఎం.రేవంత్ రెడ్డి మోసపూరిత మాటలు నమ్మొద్దు అంటూ కేరళ ప్రజలను ఉద్దేశించి కల్వకుంట్ల కవిత సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు….

ప్రస్తుతం ఆ వీడియో ఇటు తెలంగాణలో అటు కేరళ వ్యాప్తంగా సంచలనంగా మారింది, ఆనోటా ఈనోటపడి తండ్రి కేసీఆర్ దగ్గరకు చేరింది దీంతో వీడియో చూసిన కేసిఆర్ తనను కలిసిన బి.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో కవిత విడుదల చేసిన వీడియో చూశారా..? అంటూ వాకబు చేసినట్లు తెలుస్తోంది,ఆ తరువాత ఆ వీడియోపై పార్టీ నేతలతో తన అభిప్రాయాన్ని ఒకింత పాజిటివ్ గా పంచుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి…..

కవిత విడుదల చేసిన వీడియోలో ఇటు కాంగ్రెస్ ని అటు బిజెపిని ప్రశ్నిస్తూ,తెలంగాణలో కాంగ్రెస్ చేస్తున్న అరాచకాన్ని వైఫల్యాన్ని చక్కగా వివరించి కేరళలో లెఫ్ట్ ప్రభుత్వానికి మద్దతు తెలపాలంటూ విడుదల చేసిన సందేశం తమ రాష్ట్రంలో ప్రభావితం చూపిందంటూ సీఎం పినరయి విజయన్ నుండి తనకు సమాధానం వచ్చిందని కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలకు తెలిపినట్లు సమాచారం, సోషల్ మీడియాలో కవిత విడుదల చేసిన వీడియో కాంగ్రెస్, బిజెపి పార్టీలకు నష్టం చేకూరేలా ఉందని,కవిత వీడియో కేరళ ఎన్నికలపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని తనకు సమాచారం వచ్చిందని కే సిఆర్ స్వయంగా ప్రస్తావించడంతో ఈ విషయం బిఆర్ఎస్ పార్టీలో ఆసక్తికరమైన చర్చ సాగుతున్నట్లు తెలుస్తుంది…..