Janam Muchata – Voice of the People | Telugu News Platformఇకపై తెలంగాణాలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం అంత ఈజీ కాదు!! › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 12 Aug 2026, 1:54 am
Date of Publish : 05 Apr 2026, 11:24 am  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 378 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Jogulamba Gadwal > Khammam > Mahabubabad > Politics > Telangana

ఇకపై తెలంగాణాలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం అంత ఈజీ కాదు!!

ఇకపై తెలంగాణాలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం అంత ఈజీ కాదు!!

డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో తెలంగాణా సర్కార్కీ కీలక మార్పులకు శ్రీకారం చుట్టబోతుంది,తెలంగాణా ప్రభుత్వం. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా మార్పులు చేబడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు,సుప్రీంకోర్టు ఆదేశించిన "స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్" ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ పొందడం మరింత కఠినతరం కాబోతోంది ఇక నుండి లెర్నర్స్ లైసెన్స్ దరఖాస్తుకు ముందే రోడ్డు భద్రతపై ఆన్‌లైన్ అవగాహన పరీక్ష నిర్వహించడంతో పాటు పరీక్షలో ఉత్తీర్ణత తప్పనిసరి చేయనున్నారు.ఈ ప్రక్రియను తెలంగాణ రోడ్డు రవాణా శాఖ త్వరలోనే అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది…..

ప్రస్తుతం తెలంగాణాలో డ్రైవింగ్ లైసెన్స్ జారీకి రెండు దశలు మాత్రమే అమలులో ఉన్నాయని,ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే సరికొత్త విధానంతో ఇది మూడు దశల ప్రక్రియగా మారాబోతుందని ప్రభుత్వం వర్గాలు వెల్లడిస్తున్నాయి,దీనిప్రకారం, మొదట ఆన్‌లైన్ రోడ్డు భద్రతా అవగాహన పరీక్ష పూర్తి చేయాల్సి ఉంటుంది,ఈ విధానం అమలుపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఏప్రిల్ నెలాఖరు నాటికి వస్తుందని రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ఎం. చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.ఈ నివేదిక ఆధారంగా ఆన్‌లైన్ పరీక్షను తప్పనిసరి చేయబోతున్నామని పేర్కొన్నారు…

ఆన్‌లైన్ శిక్షణ ఆరు విధానాల్లో ఉండబోతుందని,ఒక్కో మాడ్యూల్ కు 30 నిమిషాలు సమయంతో,మొత్తం మూడు గంటలు పరీక్ష ఉంటుందని.ఇందులో వీడియో ఆధారిత పాఠాలతో పాటు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై శిక్షణ ఇస్తారని,ప్రతి మాడ్యూల్ చివరలో చిన్న పరీక్ష తప్పనిసరిగా ఉంటుందని,అభ్యర్థులు ఇంటి వద్ద కెమెరాతో కూడిన ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ లేదా గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూళ్లలో ఈ పరీక్షలో పాల్గొనవచ్చునని అధికారులు తెలిపారు.కోర్సు పూర్తి అయిన త్వరాత యూనిక్ సర్టిఫికేట్ నంబర్ కేటాయిస్తారు,లెర్నర్స్ లైసెన్స్ దరఖాస్తుకు ఈ నంబర్ తప్పనిసరిగా అవుతుందని అధికారులు తెలిపారు,ఈ శిక్షణలో ప్రధానంగా రోడ్డు ప్రమాదాలకు కారణాలు, అద్దాల వినియోగం, సురక్షిత ఓవర్‌టేకింగ్ వంటి అంశాలు వివరిస్తారు. వాస్తవ ప్రమాదాల వీడియోలతో డ్రైవర్లు చేసే పొరపాట్లపై అవగాహన కల్పిస్తారు…..