Janam Muchata – Voice of the People | Telugu News Platformకాషాయం పార్టీలో మున్సిపల్ ఎన్నికల ఖర్చుల లొల్లి!? › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 14 Aug 2026, 12:34 pm
Date of Publish : 30 Mar 2026, 11:51 am  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 533 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

కాషాయం పార్టీలో మున్సిపల్ ఎన్నికల ఖర్చుల లొల్లి!?

కాషాయం పార్టీలో మున్సిపల్ ఎన్నికల ఖర్చుల లొల్లి!?

పిబ్రవరిలో జరిగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కోసం బీజేపీ పార్టీ అధిష్టానం పంపించిన నిధులు స్వాహా చేసిన బీజేపీ జిల్లా ఇంచార్జ్‌లు డబ్బులు తిరిగి చెల్లించాల్సిందే అంటూ అధిష్టానం సీరియస్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి, వివరాల్లోకి వెళితే ఇటివల తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వార్డులను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించి అందుకు తగినట్లు బీజేపీ అధిష్టానం జిల్లా ఇంచార్జులకు పంపించింది కానీ జిల్లా ఇంచార్జ్‌లు అభ్యర్థులకు డబ్బు ఇవ్వకుండా, సగానికి పైగా డబ్బులను స్వాహా చేసినట్లు గుర్తించి వారిపై బీజేపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి….

ఇదే విషయం పై ఖమ్మం జిల్లా బీజేపీ పార్టీ నేతలపై గత కొంత కాలంగా సోషల్ మీడియాలో అనేక పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి, ఖమ్మం జిల్లాలో ఏదులాపురం,కల్లూరు,మధిర, సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ నేతలు,ఇంచార్జులు కుమ్మక్కై అభ్యర్థులకు ఇవ్వాల్సిన డబ్బులో సగానికి పైగా మింగేశారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో కొందరు కార్యకర్తలు బహిరంగంగా పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి ఈ విషయం ఆనోటా,ఈనోటపడి అధిష్టానం దృష్టికి చేరినట్లు తెలిసింది,ఈ క్రమంలో కొందరు నాయకులకు అధిష్టానం సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది…..

తాజాగా ఉత్తర తెలంగాణలోని ఒక జిల్లాకు చెందిన మహిళా నాయకురాలిపై, కార్యకర్తలు అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో జిల్లా ఇంచార్జుల అక్రమ బాగోతం బయట పడింది దీంతో మొత్తం పది జిల్లాల్లో ఇదే జరిగిందని, బాధ్యులకు నోటీసులు ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధమవుతున్నట్లు సమాచారం,అంతే కాకుండా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇదే తరహాలో నిధులు దుర్వినియోగం జరిగిందని, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే జరగడంతో అధిష్టానం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని బీజేపీ నాయకుల్లో చర్చ జరుగుతుంది…

ఈ మొత్తం వ్యవహారంలో జిల్లా అధ్యక్షులు,కార్యదర్శులు,ఇంచార్జుల వెర్షన్ వేరేలా ఉంది మేము పార్టీలోని బడా నాయకులకు మేము డబ్బులిచ్చి పదవులు కొనుక్కున్నామని,తాము ఖర్చు చేసిన డబ్బులు ఎలా రికవరీ అవుతాయని,2028 లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు నిధులు ఎలా జమ చేసుకోవాలని రాష్ట్ర నాయకులను బాధ్యులు నిలదీస్తున్నట్లు బీజేపీ నేతలు,కార్యకర్తల్లో విపరీతమైన చర్చ సాగుతోందని కొందరు పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు,ఏది ఏమైనా ఖర్చు పెట్టిన డబ్బులకు తగినన్ని సీట్లు రాకపోగా,ఇచ్చిన డబ్బులు అన్యాక్రాంతమయ్యాయని,ఈ విషయం మీద సొంత పార్టీ కార్యకర్తలే సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో ఆరోపణలు ఎదుర్కుంటున్న నాయకులపై బీజేపీ పార్టీ అధిష్టానం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందనే అంశంపై ఎదురు చూడాల్సిందే…..