Janam Muchata – Voice of the People | Telugu News Platformఖమ్మం “స్మార్ట్ కిడ్జ్” స్కూల్లో ఘనంగా ఉగాది వేడుకలు!! › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 13 Aug 2026, 10:45 am
Date of Publish : 19 Mar 2026, 8:22 am  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 602 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

ఖమ్మం “స్మార్ట్ కిడ్జ్” స్కూల్లో ఘనంగా ఉగాది వేడుకలు!!

ఖమ్మం “స్మార్ట్ కిడ్జ్” స్కూల్లో ఘనంగా ఉగాది వేడుకలు!!

స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో తెలుగు సంవత్సరాది పర్వదినం శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు పంచకట్టు, చీరకట్టు, లంగా ఓని తెలుగు సాంప్రదాయ దుస్తులలో మురిసిపోయారు,తొలుత సూర్య భగవానుడికి, ప్రకృతి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం షడ్రుచులతో ఉగాది పచ్చడి తయారు చేశారు. అనంతరం విద్యార్థులందరికీ ఉగాది పచ్చడి అందించారు….

అనంతరం పాఠశాలను సాంప్రదాయకరంగా మామిడాకులు, కొబ్బరాకులతో శోభాయ మానంగా తీర్చిదిద్దారు,ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ తెలుగు సాంప్రదాయ పర్వదినాలలో ఉగాది పర్వదినం తొలి రోజులలో వచ్చే పర్వదినమని, ఈ పర్వదినాన్ని తెలుగు సంవత్సరాదిగా తెలుగు లోగిళ్లలన్నింటిలో జరుపుకుంటున్నామని తెలిపారు,ఈ పర్వదినం రోజు నాటికి ప్రకృతి మాత నూతన శోభను సంతరించుకుంటుందని తెలిపారు…

ఈ తెలుగు సంవత్సరాదిని శ్రీ పరాభవ నామ తెలుగు సంవత్సరంగా పిలుస్తారు. 60 సంవత్సరాల తెలుగు సంవత్సరాల లో 33వ తెలుగు సంవత్సరం ఈ పరాభవనామ తెలుగు సంవత్సరాన్ని ప్రస్తుతం జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. తెలుగువారి కుటుంబాలు అన్నింటిలో నూతన శోభ వెల్లివిరియాల అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు…..