Janam Muchata – Voice of the People | Telugu News Platformపులి గుండాల ప్రాజెక్టు నుండి రైతులకు నీటిని విడుదల చేయాలి:అధికారులకు… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 13 Aug 2026, 5:38 am
Date of Publish : 17 Mar 2026, 7:27 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 112 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

పులి గుండాల ప్రాజెక్టు నుండి రైతులకు నీటిని విడుదల చేయాలి:అధికారులకు మంత్రి తుమ్మల అదేశాలు !!

పులి గుండాల ప్రాజెక్టు నుండి రైతులకు నీటిని విడుదల చేయాలి:అధికారులకు మంత్రి తుమ్మల అదేశాలు !!

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లోని పులిగుండాల ప్రాజెక్టు పరిధిలోని బ్రహ్మలకుంట గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయన్న రైతుల విజ్ఞప్తిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుస్పందించారు,పరిస్థితి తీవ్రతను గుర్తించి ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదలలో ఉన్న అడ్డంకులను వెంటనే తొలగించి సుమారు 1000 ఎకరాలకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు,ఈ మేరకు మంత్రి తుమ్మల ప్రాజెక్టు పరిస్థితులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు,నీటి విడుదలలో ఉన్న సాంకేతిక, పరిపాలనా సమస్యలను గుర్తించి, రెవెన్యూ మరియు ఫారెస్ట్ శాఖల సమన్వయంతో వాటిని అత్యవసరంగా పరిష్కరించాలని స్పష్టమైన అదేశాలు జారీ చేశారు…..

ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్,డీ.ఎఫ్.ఓ సిద్ధార్థతో మంత్రి నేరుగా ఫోన్‌లో మాట్లాదారు,నీటి విడుదలలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే తక్షణమే పరిష్కరించాలని సూచించారు,సాగునీటి విడుదలకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని, రైతుల ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు,అలాగే నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి నీటి విడుదలను వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల పేర్కొన్నారు,పరిస్థితి అత్యవసరంగా ఉన్నందున క్షేత్ర స్థాయిలో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు…..

రైతుల పంటలను ఎండిపోకుండా కాపాడటం ప్రభుత్వ మొదటి ప్రాధాన్యతని,ప్రతి రైతుకు సాగునీరు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని,పులిగుండాల ప్రాజెక్టు నుంచి నీటి విడుదలతో ఆయకట్టు పరిధిలోని వేలాది ఎకరాలకు ప్రాణాధారం లభించనుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు,మంత్రి ఆదేశాల నేపథ్యంలో అధికారులు వేగంగా స్పందించి నీటి విడుదల ప్రక్రియను ప్రారంభిస్తారని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు……