Janam Muchata – Voice of the People | Telugu News Platformపాల్వంచ శ్రీనివాసగిరి శ్రీవారి కళ్యాణంలో పాల్గొన్న మంత్రి “పొంగులేటి” దంపతులు!! › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 13 Aug 2026, 7:25 am
Date of Publish : 15 Mar 2026, 7:29 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 306 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

పాల్వంచ శ్రీనివాసగిరి శ్రీవారి కళ్యాణంలో పాల్గొన్న మంత్రి “పొంగులేటి” దంపతులు!!

పాల్వంచ శ్రీనివాసగిరి శ్రీవారి కళ్యాణంలో పాల్గొన్న మంత్రి “పొంగులేటి” దంపతులు!!

పాల్వంచ : ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీనివాసగిరి భక్తుల కోలాహలంతో నిండిపోయింది. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన తిరుకళ్యాణ మహోత్సవం కనులపండువగా జరిగింది. కొండపై వేద పండితుల మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి కల్యాణ వేడుక అత్యంత వైభవంగా సాగింది. ఈ పుణ్యకార్యంలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన భార్య మాధురితో కలిసి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు,ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి దంపతులు సామాన్య భక్తులవలె 1,600 మెట్లను కాలినడకన ఎక్కుతూ గిరిశిఖరానికి చేరుకున్నారు. దారి పొడవునా గోవింద నామస్మరణ చేస్తూ, తనను పలకరించిన భక్తులకు చిరునవ్వుతో సమాధానమిస్తూ ముందుకు సాగారు.దేవుని దగ్గర అందరూ సమానమే అని ఆయన చాటిచెప్పారు….

ఆ తర్వాత ప్రధాన ఆలయానికి చేరుకున్న మంత్రి దంపతులకు ఆలయ కమిటీ ఘనస్వాగతం పలికారు, స్వామివారికి మంత్రి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు,అనంతరం జరిగిన కళ్యాణ వేడుకను భక్తిశ్రద్ధలతో వీక్షించారు.పండితులు వారికి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు, స్వామి వారి దర్శనం తర్వాత మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రకృతి ఒడిలో ఉన్న శ్రీనివాసగిరిని దర్శించుకోవడం నా అదృష్టమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అటవీ శాఖ అధికారుల సహకారంతో ఈ క్షేత్రాన్ని గొప్ప ‘ఎకో టూరిజం’ (ప్రకృతి పర్యాటక) కేంద్రంగా తీర్చిదిద్దుతామని. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ స్వామిని వేడుకున్నట్లు తెలిపారు……