Janam Muchata – Voice of the People | Telugu News Platform › ప్రజాసేవలో భాగస్వామ్యం కావడం దేవుడిచ్చిన వరం: మంత్రి పొంగులేటి శ్రీనివాస… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 ✈ in @ ✉
janammuchata.in 10 Oct 2026, 9:46 pm
Date of Publish : 12 Mar 2026, 12:09 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 171 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

ప్రజాసేవలో భాగస్వామ్యం కావడం దేవుడిచ్చిన వరం: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి!!

ప్రజాసేవలో భాగస్వామ్యం కావడం దేవుడిచ్చిన వరం: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి!!

గురువారం ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు,ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాజకీయాల్లోకి మనం వచ్చింది కేవలం ప్రజా సేవ కోసమే. ఐదేళ్ల తర్వాత మనం పదవి నుంచి దిగిపోయేటప్పుడు.. మన గ్రామం, మన వార్డు ఎంతో అభివృద్ధి చెందిందని ప్రజలు మనల్ని మనస్ఫూర్తిగా అభినందించాలి. ఆ ఆత్మీయతే మనం సంపాదించుకునే అసలైన ఆస్తి" అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు….

గ్రామ పంచాయతీల బలోపేతం కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. "గడిచిన కొద్ది రోజుల్లోనే పంచాయతీల ఖాతాల్లోకి గణనీయంగా నిధులు జమ అయ్యాయి. మార్చి ఆఖరు నాటికి మరిన్ని నిధులు రాబోతున్నాయి. ఈ నిధులను ఒక ప్రణాళికాబద్ధంగా, ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం వినియోగించాలి. మన సొంత డబ్బును ఎంత జాగ్రత్తగా వాడుకుంటామో.. ప్రజా ధనాన్ని కూడా అంతే బాధ్యతగా కాపాడుతూ అభివృద్ధి పనులు చేపట్టాలి" అని సర్పంచులకు సూచించారు,అంతే కాకుండా అభివృద్ధి పనుల నిర్వహణలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి కోరారు,ముఖ్యంగా తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల కల్పనలో చిన్నపాటి సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయని వివరించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు…..

అదే విధంగా ఎన్నికల వరకే రాజకీయాలు.. గెలిచిన తర్వాత మనమంతా ప్రజల సేవకులం. పార్టీలకతీతంగా ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలి" అని మంత్రి పిలుపునిచ్చారు. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులకు అధికారులు పూర్తి స్థాయిలో మార్గనిర్దేశం చేస్తూ, వారిని ప్రోత్సహించాలని ఈ వేదిక ద్వారా కోరారు. ప్రభుత్వం చేపట్టిన ఈ 99 రోజుల ప్రణాళికలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఆకాంక్షించారు….