జనం ముచ్చట, ఖమ్మం జిల్లా:
వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్ళు కోల్పోయిన పేదలకు అదే స్థలంలో ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ళు కట్టించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో దానికి సంబదించి లబ్దిదారులకు పట్టాలు పంపిణి కార్యక్రమం నిన్న కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో జరిగింది,ఈ కార్యక్రమానికి డిప్యూటీ సియం.మల్లు భట్టి విక్రమార్క,జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొనిమూడు వందల పదకొండు మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు...ఈ సందర్బంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ కొద్ది మంది ముఠాలుగా ఏర్పడి గ్రామీణ పేదల సంఘం ముసుగులో మోసం,దగా చేసి పేదల కాయకష్టాన్ని నిధులుగా సమీకరించుకుని ప్రభుత్వ భూముల దురాక్రమణకు పాల్పడిందని, ఈ విషయంలో గత ప్రభుత్వం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారించడంతో దాన్ని ఆసరాగా తీసుకుని వసూల్ల ముఠా కోర్టుకు వెళ్లిందని,2023 లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూదాన్ భూముల్లో నివాసాలు నిర్మించుకున్న పేదలకు మౌలిక వసతులు కల్పించడం కోసం ప్రయత్నించినప్పటికీ ఈ అంశం కోర్టు పరిధిలో ఉండటం మూలంగా మౌళిక వసతులు కల్పించే అవకాశం లేకుండా పోయిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు….
భూదాన్ భూముల అంశంలో జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో చర్చలు జరిపి కోర్టు తీర్పుకు అనుగుణంగా ముప్పై రెండు ఎకరాలు భూదాన్ భూములే నిర్ధారణ చేశారని, అయినప్పటికి భూధాన్ బోర్డు పేరుతో కొంతమంది మధ్య దళారులు తెచ్చిన పట్టాలు బోగస్ అని రెవిన్యూ అధికారులు తెల్చారని,అసలు భూదాన్ కమిటీనే తప్పుడు కమిటీ అని దానికి వెలుగుమట్ల భూములకు సంబంధం లేదని , ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో భూదాన్ ట్రస్ట్ అనేదే లేదుని,గత ప్రభుత్వమే దాన్ని రద్దు చేసి సిసిఎల్ఏకి అప్పగించడం జరిగిందని అందుకే కోర్టు తీర్పును అనుసరించి సిసిఎల్ఏ భూమిని స్వాదీనం చేసుకోమని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసిందని,మంత్రి తుమ్మల అన్నారు….,
సిసిఎల్ఏ ఆదేశాల ప్రకారం జిల్లా యంత్రాంగం అక్కడ ఉన్న అర్హులైన నిరుపేదలకు అక్కడే ఇళ్ల పట్టాలు ఇచ్చి అనర్హులను, దోపిడీదారులను,దగాకోరులను బయటకు పంపించాలని చాలా ప్రయత్నం చేసామని కానీ కొంతమంది దగాకోరులు వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం పేదలను అడ్డం పెట్టుకుని అధికారులను, ప్రజాప్రతినిధులను,మీడియాను లోపలికి రానివ్వకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి దౌర్జన్యపూరితంగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పక్కనే ఒక సమాంతర రాజ్యాన్ని నడుపుతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇది గుడ్డి ప్రభుత్వం కాదని, ఉక్కు పాదంతో అణిచి వేస్తామని,దోపిడీ ముఠాను మంత్రి తుమ్మల హెచ్చరించారు అంతే కాకుండా దగాకోరులు ఖర్చుల పేరుతో పేదప్రజల దగ్గర వసూలు చేసిన ప్రతి రూపాయి రికవరీ చేసి తిరిగి పేదలకు చెల్లిస్తామని తెలిపారు…..
అదే విధంగా సిసిఎల్ఏ ఆదేశానుసారం కలెక్టర్, పోలీస్ కమీషనర్ పూర్తి సమన్వయంతో వ్యవహారించి ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా ఎవరి సామాన్లు వారే స్వచ్చందంగా తరలించుకునే విధంగా ఏర్పాట్లు చేసారని,దోపిడీ దొంగల బండారం బయట పెట్టి, దుర్మార్గులను తరిమికొట్టడం కోసం నిరుపేదలకు భూదాన్ భూములు దక్కాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం పేదల ఇండ్లను ఖాళీ చేయించిందని,ఇండ్లు ఖాళీ చేయించిన పేదలకు వేరే ఎక్కడైనా స్థలాలు ఇద్దామనే ప్రత్తిపాదన వచ్చినప్పటికి సియం.రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టుబట్టి దగాకోరులు ఎక్కడైతే పేద ప్రజలను మోసం చేసారో అక్కడే గర్వాంగా తలెత్తుకుని జీవించేలాగా ఉండాలని భూదాన్ భూముల్లోనే ఇండ్ల స్థలాలు కేటాయించడం జరిగిందని మంత్రి తుమ్మల అన్నారు…
రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భూదాన్ భూముల్లో ఇండ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇందిరమ్మ ఇల్లు నిర్మించి,కావాల్సిన మౌళిక వసతులన్నీ యుద్ధ ప్రాతిపదిక మీద కల్పించి, పిల్లల చదువుల కోసం మోడల్ స్కూల్ నిర్మించి రాష్ట్రంలోనే మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతామని, రాబోయే డిసెంబర్ తొమ్మిదవ తారీఖు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్బంగా సియం. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం చేసే బాధ్యత మాదని,పేదల ఇళ్లను ఖాళీ చేయించిన విషయంలో పేద ప్రజలకు జరిగిన అసౌకర్యాన్ని స్థానిక శాసనసభ్యునిగా నన్ను,ప్రభుత్వాన్ని అర్ధం చేసుకోవాలని మంత్రి తుమ్మల కోరారు, ఖమ్మం పట్టణంలో అనధికారికంగా, అక్రమంగా,చట్ట విరుద్ధంగా పేదలు బ్రతకొద్దని అన్ని మౌళిక వసతులు కలిపించి స్వేచయితమైన జీవితాన్ని ఇవ్వడం కోసం ప్రయత్నం చేశామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు, ఏది ఏమైనప్పటికి ముగ్గురు మంత్రుల ఆధ్వర్యంలో నిరుపేదలకు న్యాయం జరిగిందని, బాధితులు ఇన్ని రోజులు అనుభవించిన మానసిక క్షోభకు ఉపశమనంలభించిందని బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు…..
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456