Janam Muchata – Voice of the People | Telugu News Platform › పువ్వాడ ఉదయ్ నగర్లో జరుగుతున్న అక్రమ భూదందాపై హైకోర్టులో రిట్… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 ✈ in @ ✉
janammuchata.in 11 Oct 2026, 10:15 pm
Date of Publish : 11 Mar 2026, 11:46 am  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 328 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

పువ్వాడ ఉదయ్ నగర్లో జరుగుతున్న అక్రమ భూదందాపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు?

పువ్వాడ ఉదయ్ నగర్లో జరుగుతున్న అక్రమ భూదందాపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు?

పువ్వాడ ఉదయ్ నగర్లో ప్రభుత్వ భూముల దురాక్రమణలపై రెవెన్యూ అధికారులు నోరు మెదపక పోవడం వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరు ?

ఓ మట్టి వ్యాపారి తన బినామీ పేర్లతో ఎనిమిది ఎకరాల ఎస్సైండ్ భూమి ఆక్రమించి ఫామ్ హౌస్ నిర్మాణం చేస్తుంటే విచారణ జరిపిన రెవెన్యూ అధికారి ఇచ్చిన రిపోర్ట్ ఏమిటి?

POT చట్టం ప్రకారం ఎస్సైండ్ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు నిషేధం అలాంటిది మధ్య దళారీల పేరు మీద ఎస్సైండ్ పట్టాలు ఎలా వచ్చాయి ?

ఓ వీఆర్వో 192 సర్వే నెంబర్లో ఏకంగా 430 దొంగ పొజిషన్ సర్టిఫికెట్లు,ఇంటి నెంబర్లు కేటాయిస్తుంటే మండల రెవెన్యూ అధికారులు ఏమి చేస్తున్నారు,మామూళ్ల మత్తులో జోగుతూ తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు వ్యవహరించారా ?

గత ప్రభుత్వంలో, ప్రస్తుత ప్రభుత్వంలో ఏదెచ్చగా సాగుతున్న అక్రమ భూదందాతో పాటు వందల కోట్ల విలువైన అక్రమ మట్టి తవ్వకాలపై రెవిన్యూ అధికారులు ఎందుకు మిన్నకుండి పోతున్నారు….

ఓ మట్టి వ్యాపారి బినామీ పేర్లతో చేస్తున్న అక్రమ మట్టి దందాపై ప్రభుత్వం కోట్ల రూపాయల ఫైన్ విధిస్తే,ఆ పైన్ తాలుకూ ఫైలును మైనింగ్ డిపార్ట్మెంట్ ఎందుకు అమలు చేయడం లేదు? ఈ వ్యవహారం వెనుక చక్రం తిప్పిన జిల్లా మంత్రి ప్రధాన అనుచరుడు ఎవరు ?

పువ్వాడ ఉదయ్ నగర్లో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ భూదందా ప్రస్తుత ప్రభుత్వంలో కూడా కొనసాగుతుందా ?

ఈ మొత్తం వ్యవహారంలో మంత్రి తనయుని పేరు చెప్పి వెనుకనుండి నడిపిస్తున్న ఆ నలుగురు అధికార పార్టీ నాయకులు ఎవరు ?

పువ్వాడ ఉదయ్ నగర్లో జరుగుతున్న వందల కోట్ల భూదందాలో తాజా,మాజీ ప్రజాప్రతినిధులతో పాటు రెవెన్యూ అధికారులు, రాజకీయ నాయకుల పాత్రపై పూర్తి ఆధారాలతో శుక్రవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయనున్న ప్రజా సంఘాలు…..