Janam Muchata – Voice of the People | Telugu News Platform › ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శానిటరీ ఇన్స్పెక్టర్ కీచక పర్వం!! › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 ✈ in @ ✉
janammuchata.in 12 Oct 2026, 1:54 am
Date of Publish : 09 Mar 2026, 10:11 am  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 1412 💬 0
Latest News

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శానిటరీ ఇన్స్పెక్టర్ కీచక పర్వం!!

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శానిటరీ ఇన్స్పెక్టర్ కీచక పర్వం!!

ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్న వేళ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కర్యాలయంలో కీచక పర్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది,రెండు నెలల క్రితం ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ కూతురు వయసు ఉండే తోటి మహిళా ఉద్యోగులపై బాడీ షేమింగ్ చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని స్వయంగా మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ కు పిర్యాదు చేసింది,పిర్యాదు చేసి రెండు నెలలు దాటినప్పటికి సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకోక పోవడం వెనుక దాగి ఉన్న అంతర్యం ఏమిటనేది ఎవరికి బోధ పడడం లేదు….

గత రెండు నెలల క్రితం కార్పొరేషన్ కార్యాలయంలో విధుల్లో ఉన్న మహిళా ఉద్యోగిణులు పట్ల ఒక శానీటరీ ఇన్స్పెక్టర్
ఇష్టానుసారంగా నోటికోచ్చిన బూతలు మాట్లాడడమే కాకుండా కొంతమంది మహిళా ఉద్యోగిణులపై దాడికి కూడ ప్రయత్నించినట్లు తెలుస్తుంది,గత కొన్నేళ్లుగా సదరు శానిటరీ ఇన్స్పెక్టర్ మహిళా ఉద్యోగినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా కొంతమంది మహిళా ఉద్యోగిణులను బాడీ షేమింగ్ చేస్తూ శూనకానందం పొందడం,మరి కొంతమంది మహిళా ఉద్యోగిణుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడడం నిత్యకృత్యంగా మారింది,తన మాట వినని మహిళా ఉద్యోగిణులపట్ల అసభ్యకరంగా కామెంట్లు చేస్తూ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుస్తుంది…,

సదరు శాడిస్ట్ శానిటరీ ఇన్స్పెక్టర్ వేధింపులు తట్టుకోలేక జనవరి ముప్పైవ తారీఖున మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కు మహిళా సదరు శానిటరీ ఇన్స్పెక్టర్ పై చర్యలు తీసుకోవాలంటూ మహిళా ఉద్యోగిణులు పిర్యాదు చేశారు దానికి స్పందించిన మేయర్ జవాన్ నుండి శానిటరీ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ పొంది, లైంగిక ఆరోపణలు ఎదురుకుంటున్న వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలంటూ పిర్యాదును మున్సిపల్క మీషనర్ కు ఎండార్స్ చేశారు కానీ ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకోవడానికి మున్సిపల్ కమీషనర్ వెనకాడటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి….

మహిళా ఉద్యోగిణులు పిర్యాదు చేసి నెల రోజులు దాటినా
కనీసం చర్యలు తీదుకోవడం లేదని మహిళా ఉద్యోగిణులు వాపోతున్నారు,సాక్షాత్తు మంత్రి తుమ్మల ప్రాతినిద్యం వహిస్తున్న నియోజకవర్గంలో, ఒక మహిళా మేయర్ గా, ఒక ఐఏఎస్ కమీషనర్ గా పనిచేస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మహిళలకు రక్షణ కరువైందనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి,ఇప్పటికైనా కీచక శానిటరీ ఇన్స్పెక్టర్ ను విధుల నుండి తొలగించి మహిళా ఉద్యోగినులకు న్యాయం చేయాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి….