Janam Muchata – Voice of the People | Telugu News Platform › ప్రభుత్వ భూమి ఆక్రమణ విచారణపై అనుమానాలు!! › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 ✈ in @ ✉
janammuchata.in 11 Oct 2026, 5:14 am
Date of Publish : 06 Mar 2026, 8:05 am  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 329 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

ప్రభుత్వ భూమి ఆక్రమణ విచారణపై అనుమానాలు!!

ప్రభుత్వ భూమి ఆక్రమణ విచారణపై అనుమానాలు!!

రఘునాథపాలెం మండలం కోయచలక రెవెన్యూ పరిధిలోని 192 సర్వే నెంబర్లో ఒక మట్టి వ్యాపారి ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి చుట్టూ ఫెన్సింగ్ వేయడంతో పాటు ఫామ్ హౌస్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నాడని దానిపై విచారణ జరిపించాలని రఘునాథపాలెం మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి రెండు రోజుల క్రితం వినతి పత్రం ఇచ్చిన సంగతి విదితమే,ఈ విషయంపై"జనం ముచ్చట" లో వార్త ప్రచురితం అయింది,"జనం ముచ్చట" లో వచ్చిన వార్తకు స్పందించిన జాయింట్ కలెక్టర్ దానిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు…..

జాయింట్ కలెక్టర్ ఆదేశానుసారం నిన్న ఉదయం రఘునాతపాలెం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది కానీ అక్కడ జరిగిన కొన్ని సంఘటనలను గమనిస్తే విచారణ నిష్పక్షపాతంగా జరగలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి,జాయింట్ కలెక్టర్ విచారణకు ఆదేశించిన విషయాన్ని ఎవరు ఎవరికీ ఉప్పందించారు,గత కొన్నేళ్లుగా ఫీల్డ్ లో లేని పట్టాదారులు అధికారులు విచారణకు వెళ్లడానికి అయిదు నిమిషాల ముందు ఫీల్డ్ మీదకు ఎలా వచ్చారు,వాళ్లను తీసుకు వచ్చింది ఎవరు,ఈ మొత్తం వ్యవహారాన్ని వెనుకనుండి నడిపిస్తున్న అదృశ్య శక్తి ఎవరు ?అనే అంశం మీద స్థానికులు అనేక వ్యక్తం చేస్తున్నారు, టోటల్ ఎపిసోడ్ లో విచారణ అధికారి పాత్రపై కూడా స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు,ఈ అధికారి అర్బన్ మండలంలో పనిచేసే సమయంలో అతనిపై అనేక అవినీతి ఆరోపణలు ఉండడంతో రఘునాథపాలెం మండలానికి బదిలీ చేశారని,ఇన్ని ఆరోపణలు ఎదుర్కుంటున్న సదరు అధికారి విచారణ జరిపితే న్యాయం జరగదని స్థానికులు చెప్పడం విశేషం…..

అంతే కాకుండా గత నెల రోజులుగా పువ్వాడ ఉదయ్ నగర్లోని ఇదే 192 సర్వే నెంబర్లో పద్దెనిమిది ఎకరాల ఇరువై కుంటల భూమిని మాజీ సర్పంచ్, ప్రస్తుత సర్పంచ్ కలిసి ఆ భూమిని దాదాపు వెయ్యి ప్లాటుగా చేసి అమ్ముకున్న ఉదంతంపై "జనం ముచ్చట" లో ఆధారాలతో సహా వరుస వార్తా కథనాలు వ్రాస్తే ఈ సెక్ట్రా కు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా వ్యవహరించే సదరు అధికారి, పంచాయతీ సెక్రటరీ కనీసం స్పందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు,ప్రభుత్వ భూములను కాపాడాల్సిన పంచాయతీ సెక్రటరీ అక్రమార్కులతో చేతులు కలిపి తప్పుడు రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు,కరెంట్ మీటర్లు జారి చేస్తున్నాడని స్థానికులు ఆధారాలు చూపిస్తూ మరీ సదరు అధికారులపై మండిపడుతున్నారు,ఇకనైనా ఈ భూ ఆక్రమణలపై అధికారులు దృష్టి సారించి నిష్పాక్షికంగా విచారణ చేయాలని లేకుంటే ఈ విషయం మీద రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, స్ధానిక మంత్రి తుమ్మల నాగేశ్వరరావును,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,జిల్లా కలెక్టర్, రెవెన్యూ ప్రిన్సిపుల్ సెక్రటరీకి వినతి పత్రాలు ఇస్తామని అప్పటికి న్యాయం జరగకపోతే హైకోర్టు మెట్లు ఎక్కుతామని స్థానికులు స్పష్టం చేస్తున్నారు…..