Janam Muchata – Voice of the People | Telugu News Platform › సిపిఎం పార్టీలో కుదుపు…తమ్మినేని వీరభద్రం పై కేంద్ర కమిటీ “అభిశంసన”లేఖ!! › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 ✈ in @ ✉
janammuchata.in 10 Oct 2026, 9:19 pm
Date of Publish : 03 Mar 2026, 10:43 am  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 1998 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

సిపిఎం పార్టీలో కుదుపు…తమ్మినేని వీరభద్రం పై కేంద్ర కమిటీ “అభిశంసన”లేఖ!!

సిపిఎం పార్టీలో కుదుపు…తమ్మినేని వీరభద్రం పై కేంద్ర కమిటీ “అభిశంసన”లేఖ!!

సిపిఎం పార్టీలో గత పది సంవత్సరాలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విబేధాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి,ఒకనాడు సిపిఎం పార్టీలో తానే పార్టీ అన్నట్లుగా వ్యవహరించిన తమ్మినేని వీరభద్రంపై సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ "అభిశంసన లేఖ" లేఖను విడుదల చేసింది, అయన చేసిన తప్పుల చిట్టాతో అభిశంసన లేఖను రూపొందించినట్లు తెలుస్తుంది, ఈ మేరకకేంద్ర కమిటీ కార్యదర్శి ఎమ్.ఎ. బేబీ పేరుతో విడుదలైన లేఖను నిన్న జరిగిన రాష్ట్ర కమిటీకి పంపింది,ముఖ్యంగా ఈ లేఖలో పదేండ్ల పాటు పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం పని తీరుపై కేంద్ర కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది, పార్టీ సిద్ధాంతాలు,క్రమశిక్షణ ఉల్లంఘించి పార్టీ అంతర్గత నిర్మాణాన్ని బలహీన పరిచారంటూ నాలుగ్గున్నర పేజీల "అభిశంసన లేఖ"ను రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చకు పెట్టింది,ఈ లేఖ ప్రస్తుతం తెలంగాణా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది….

హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిన్న జరిగిన సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది, ఈ సమావేశానికి తెలంగాణ ముప్పై మూడు జిల్లాల కార్యదర్శులు హాజరయ్యారు ఈ క్రమంలో తమ్మినేని వీరభద్రంపై కేంద్ర కమిటీ కార్యదర్శి ఎం.ఎ.బేబీ పేరుతో విడుదలైన "అభిశంసన లేఖ"ను సమావేశంలో రాష్ట్ర కమిటీ ప్రవేశ పెట్టింది,ఈ లేఖలో జాతీయ నాయకత్వం కొన్ని కీలక అంశాలను ప్రస్థావించింది,పదేళ్ల పాటు తమ్మినేని తీసుకున్న సొంత నిర్ణయాలు సిపిఎం పార్టీని తీవ్రంగా నష్ట పరిచినట్లు లేఖలో పేర్కొంది, ముఖ్యంగా 2025 లో సంగారెడ్డిలో జరిగిన రాష్ట్ర మహాసభల సమయంలో రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక ప్రక్రియలో జరిగిన పరిణామలే ఈ వివాదానికి ప్రధాన కారణంగా పేర్కొన్నారు, రాష్ట్ర కార్యదర్శి ఎన్నికలో కేంద్ర నాయకత్వం ఏకగ్రీవ నిర్ణయాన్ని కోరుకున్నప్పటికి దానికి భిన్నంగా ఎన్నిక జరగాల్సిందేనని తమ్మినేని పట్టుబట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి, దీంతో సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకత్వం రెండుగా చీలిపోయిందని,అంతర్గత విభేదాలు ముదిరాయని పార్టీ వర్గాలు వ్యాఖ్యనిస్తున్నాయి,తమ్మినేని వీరభద్రం ఒంటెద్దు పోకడలు,అన్నాలోచిత నిర్ణయాలు సిపిఎం పార్టీకి శాపంగా మారాయని లేఖలో పేర్కొన్నారు, గత సార్వత్రిక ఎన్నికల నుండి రాష్ట్రంలో జరిగిన ఏ ఎన్నికల్లో కూడా కనీసం బోణి కొట్టే పరిస్థితి లేకపోవడాని ఆయనే కారణమని తీవ్రమైన విమర్శలు చేసారు,కేంద్ర కమిటీ విడుదల చేసిన "అభిశంసన లేఖ"పై సిపిఎం పార్టీలో ప్రస్తుతం తీవ్రమైన చర్చ నడుస్తుంది,….

అంతే కాకుండా తమ్మినేని నాయకత్వంలో రాష్ట్ర సిపిఎం పార్టీలో గ్రూపుల సంస్కృతి, కుల భావం పెంపోందిందేలా తమ్మినేని వ్యవహారించారని, ముఖ్యంగా పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధుంగా తమ్మినేని వ్యాఖ్యలు చేసారంటు కేంద్ర కమిటీ తన లేఖలో తప్పుబట్టింది, తెలంగాణాలో సిపిఎం పార్టీ దెబ్బ తినడానికి కేంద్ర ఫోలీట్ భ్యూరో నిర్ణయాలే కారణమని తమ్మినేని చేసిన వ్యాఖ్యలు సిపిఎం పార్టీ జాతీయ నాయకత్వాన్ని అసంతృప్తికి గురించేశాయని తెలుస్తుంది, తమ్మినేని ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడుగా కొనసాగుతున్నప్పటికి రాష్ట్ర కమిటీలో చర్చించే అంశాలపై మాట్లాడేందుకు తమ్మినేనికి అనుమతి లేదని కేంద్ర కమిటీ స్పష్టం చేసింది, అందుకే ఈ సమావేశంలో తమ్మినేని వీరభద్రం ఎక్కడా మాట్లాడలేదు,రాష్ట్ర స్థాయిలో ఆయన పాత్రను పరిమితం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి…..

ఒకప్పుడు తెలంగాణాలో కాంగ్రెస్,BRS పార్టీల తరువాత ప్రధానంగా గుర్తింపు పొందిన సిపిఎం పార్టీ గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాతినిద్యం కోల్పోయింది, పార్టీలో క్రమశిక్షణ దెబ్బతినడం, అంతర్గత విబేధాలు పెరగడం ఇందుకు కారణమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది
ఇపుడు కేంద్ర కమిటీ తమ్మినేని వీరభద్రంపై విడుదల చేసిన "అభిశంసన లేఖ"తో తెలంగాణా రాష్ట్ర సిపిఎం పార్టీలో మార్పు దిశగా అడుగులు పడతాయా లేక అంతర్గత విబేధాలు మరింత తీవ్రతరం అవుతాయానే అంశం వేచి చూడాలని పార్టీ వర్గాలు అంటున్నాయి,ఈ మొత్తం వ్యవహారంలో గీత దాటిన వారు ఎంతటి వారైనా కమ్యూనిస్టు పార్టీలో చర్యలు తప్పవు అనే సంకేతాలు సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పంపినట్లయిందని
సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకత్వం చెప్పడం విశేషం….