Janam Muchata – Voice of the People | Telugu News Platformఖమ్మం స్మార్ట్ కిడ్జ్ స్కూల్లో ఘనంగా “హోళీ” పండుగ సంబరాలు… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 13 Aug 2026, 6:26 am
Date of Publish : 02 Mar 2026, 8:07 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 674 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Politics > Telangana

ఖమ్మం స్మార్ట్ కిడ్జ్ స్కూల్లో ఘనంగా “హోళీ” పండుగ సంబరాలు !!

ఖమ్మం స్మార్ట్ కిడ్జ్ స్కూల్లో ఘనంగా “హోళీ” పండుగ సంబరాలు !!

ఖమ్మం సిటీ: స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో సోమవారం ముందస్తు హోలీ సంబరాలు ఆనందోత్సవాలతో జరిగాయి,పాఠశాలలోని వివిధ తరగతుల విద్యార్థులు ఒకరికొకరు సాంప్రదాయ రంగులు పూసుకొని రంగుల పండుగ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు తరతరాలుగా వస్తున్న హోలీ రంగుల వేడుకలలో ఈ సంవత్సరం కూడా స్మార్ట్ కిడ్జ్ పాఠశాల తన సంప్రదాయాన్ని కొనసాగించింది…..

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ ప్రాచీన కాలం నుంచి మన భారతీయుల సంస్కృతి సాంప్రదాయాలలో రంగుల కేలి హోలీ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉందని తెలియజేశారు, అలనాడు బృందావనంలో శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి రంగుల సంబరాలు నిర్వహించిన సాంప్రదాయాన్ని ప్రతి ఏటా ప్రజలు సాంప్రదాయంగా జరుపుకుంటున్నారని తెలిపారు….

అంతే కాకుండా ఈ హోలీ సంబరాల లో రసాయనిక రంగులను వాడడం ఆరోగ్యానికి హానికరమని,అందుకే సాంప్రదాయ మరియు సహజ రంగులను హోలీ వేడుకలలో ఉపయోగించాలని పిలుపునిచ్చారు,ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు……