Janam Muchata – Voice of the People | Telugu News Platformపువ్వాడ ఉదయ్ నగర్లో తాజా ప్రజాప్రతినిధి అక్రమ బాగోతం… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 13 Aug 2026, 5:38 am
Date of Publish : 02 Mar 2026, 5:09 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 757 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

పువ్వాడ ఉదయ్ నగర్లో తాజా ప్రజాప్రతినిధి అక్రమ బాగోతం…

పువ్వాడ ఉదయ్ నగర్లో తాజా ప్రజాప్రతినిధి అక్రమ బాగోతం…

ఖమ్మం నియోజకవర్గంలో వెలుగుమట్ల భూదాన్ భూముల అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన క్రమంలో రఘునాథపాలెం మండలం పువ్వాడ ఉదయ్ నగర్లో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై ప్రజల దృష్టి మళ్ళింది,వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదలచేత గుడిసెలు వేయించడం కోసం కొంతమంది నాయకులు కోట్ల రూపాయలు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో రఘునాథపాలెం మండల రెవెన్యూ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న పువ్వాడ ఉదయ్ నగర్లో,కోయచలక రెవెన్యూ పరిధిలోని నూట తొంభై రెండు (192 )సర్వే నెంబర్లో (18.20) పద్దెనిమిది ఎకరాల ఎస్సైండ్ భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి ఒక్కో ఎకరానికి యాభై నుండి అరవై ప్లాట్లుగా విభజించి ఒక్కో ప్లాటుకు అయిదు లక్షల రూపాయల నుండి పది లక్షల రూపాయలు వరకు వసూళ్లకు పాల్పడినట్లు తెలియ వచ్చింది,చివరకు ఒక మాజీ ప్రజాప్రతినిధి తనకు రాజకీయ బిక్ష పెట్టిన పార్టీ కార్యాలయానికి కేటాయించిన భూమిని కూడా సుమారు ఎనిమిది లక్షల రూపాయలకు అమ్ముకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.....

గత BRS ప్రభుత్వం అధికారంలో ఉన్నపటి నుండి మొదలు పెడితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల కాలంలో తాజా,మాజీలు ఇద్దరు కలిసి ఈ పద్దెనిమిది ఎకరాల భూమి మీదనే దాదాపు అరవై కోట్ల రూపాయల పైచిలుకు అక్రమంగా సంపాదించినట్లు స్థానికులు చెబుతున్నారు,నువ్వు అధికారంలో నువ్వు,నేను అధికారంలో ఉంటే నేను అనే చందంగా ఇద్దరూ తోడు దొంగల్లా మారి పువ్వాడ ఉదయ్ నగర్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాహా చేసి సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు….

పువ్వాడ ఉదయ్ నగర్ ప్రభుత్వ భూముల విషయంలో తాజాగా ఒక సంచలన అంశం వెలుగులోకి వచ్చింది, ప్రస్తుతం అధికారంలో ఉన్న ఒక ప్రజాప్రతినిధి 192 సర్వే నెంబర్లో దాదాపు పదిహేను ప్లాట్లు స్వయంగా అమ్మినట్లు అగ్రిమెంట్ పేపర్లు వెలుగులోకి వచ్చాయి,ఈ మొత్తం వ్యవహారంలో తేజస్ ప్రజాప్రతినిధి,ఆయన బంధువులు కీలక పాత్ర వహించినట్లు స్థానికులు వెల్లడిస్తున్నారు, ఒక్కో ప్లాటుకు ఆరు లక్షల నుండి ఎనిమిది లక్షల రూపాయలు వరకు అమ్మినట్లు స్థానికులు నిర్ధారిస్తున్నారు,అంతే కాకుండా ప్లాట్లు కొన్నవారికి సదరు ప్రజా ప్రతినిధి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులు చెప్పడం విశేషం,ఈఇప్పటికే పువ్వాడ ఉదయ్ నగర్లో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అనేక ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రజాప్రతినిధి ఇక్కడ ఎన్నో ఏండ్లుగా ఉంటున్న అర్హులైన పేదవారిని వదిలిపెట్టి కొత్తగా ప్లాట్లు కొన్నవారికి ఇందిరమ్మ ఇళ్లు ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు,దీనికి సంబంధించిన పలు వాయిస్ రికార్డులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం విశేషం…..

వెలుగుమట్ల భూదాన్ భూముల్లో వసూళ్లు చేసిన నాయకులు
గుట్టమీద నివాసాలు ఏర్పాటు చేసుకున్న పెద్దవాళ్ళకు త్రాగు నీరు,విద్యుత్ వంటి మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేశామని వాదిస్తుంటే ఇక్కడ మాత్రం పరిస్థితి దానికి బిన్నంగా ఉంది ప్రభుత్వ భూములను తెగనమ్ముకుని తాజా, మాజీలు తమ వ్యక్తిగత ఆస్తులు పెంచుకున్నట్లు సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి,గత పదమూడు సంవత్సరాలనుండి ప్రభుత్వ భూములను ఏదేచ్చగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటుంటే పక్కనే ఉన్న రెవెన్యూ అధికారుల కండ్లకు కనిపించడం లేదా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు,ఏది ఏమైనా వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఆక్రమణలు తొలగించిన అధికారులు పువ్వాడ ఉదయ్ నగర్ భూములపై కూడా దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు…..