జనం ముచ్చట, ఖమ్మం జిల్లా:
నిన్న ఖమ్మం జిల్లా ఐడివోసి కాంప్లెక్స్ లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పొలీస్ కమిషనర్ సునీల్ దత్ తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో ఒక సెక్షన్ ఆప్ మీడియాపై మంత్రి పొంగులేటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు,కొన్ని మీడియా సంస్థలు,కొంతమంది మీడియా ప్రతినిధులు శవాల మీద పేలాలు ఏరుకునే జుగుప్సాకరమైన రాజకీయాలు చేస్తున్నారని,విపక్ష పార్టీలకు వంత పాడుతూ గోరంతలు కొండంతలు చేస్తూ తప్పుడు ప్రచారాలకు ఆజ్యం పోస్తున్నారని ,ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపించేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు….
గత కొన్ని రోజులుగా జిల్లా మంత్రులపై కొన్ని మీడియా సంస్థలు,కొంతమంది మీడియా ప్రతినిధులు పనిగట్టుకుని
జిల్లా మంత్రులపై దుష్ప్రచారం చేస్తున్నారు,దేశంలో ఎక్కడో జరిగే ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి వంద కోట్ల రూపాయల కోసం
ఏ మంత్రి పేదల గుడిసెలను కూలగొట్టించిండని,మరో మంత్రి ముప్పై ఐదు కోట్ల రూపాయల కోసం ఇంకెవరికో దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నాడని నిరాధారమైన తప్పుడు కథనాలు వ్రాయడానికి సిగ్గు,శరం ఉండాల అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకు పడ్డారు,పేద వాడి జీవితాల మీదనా మీ తప్పుడు కథనాలు అంటూ మండి పడ్డారు,ఇపుడు ఆధారాలతో సహా వచ్చాను మీకు దమ్ముంటే సమాధానం చెప్పండి అంటూ సవాల్ విసిరారు….
అదే విధంగా నిజంగా రాజకీయాలు చేయాలంటే బెర్ర గీస్తా రండి ఎవరేంటో తేల్చుకుందాం,మీ బ్రతుకులు ఏంటో,మీ చరిత్రలు ఏమిటో ఒక్కొక్కటి బయట పెడతా అంటూ తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు,పేపర్ ఉంది కదా అని ఇష్టం వచ్చిన కథనాలు వ్రాస్తామంటే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు,అసలు ఆ పేపరుకు ఉన్న చిత్త శుద్ధి ఏమిటని నిలదీశారు,ఆ ట్యూబ్,ఈ ట్యూబ్ అంటూ వక్రీకరణలకు పాల్పడి వ్యక్తిత్వ హననం చేస్తున్నారని,ఈ మధ్య కాలంలో
ఒక విషయం మీద మాట్లాడితే దాన్ని వక్రీకరించి చూపించారని,ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడానికి బుద్ధి ఉండాలని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు,పేద వాడి పట్ల మీరు కారుస్తున్న మొసలి కన్నీరు,డ్రామాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు….
లేని విషయాన్ని ఉన్నట్లు కనికట్టు చేసి చూపించే ఒక సెక్షన్ అప్ మీడియాకు గత ప్రభుత్వం వెలుగుమట్ల భూదాన్ భూముల విషయంలో ఏం చేశారు తెలియదా,ఇండ్ల జాగాలు పేరుతో కోట్ల రూపాయలు గ్రామీణ పేదల సంఘం నాయకులు నిరుపేదల దగ్గర వసూళ్లు చేసిన ఘటనలుమీడియాకు కనపడడం లేదా అంటూ ప్రశ్నించారు ఇకనైనా అబద్ధాలను ప్రచారం చేయడం,తప్పుడు కథనాలను ప్రచారం చేయడం మానుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హితవు పలికారు…..
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456