Janam Muchata – Voice of the People | Telugu News Platform › పేదల సొమ్మును దోచుకున్న దొంగలను శిక్షిస్తాం,నయా పైసలతో సహా కక్కిస్తాం:… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 ✈ in @ ✉
janammuchata.in 10 Oct 2026, 9:46 pm
Date of Publish : 01 Mar 2026, 11:44 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 272 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > State Politics > Telangana

పేదల సొమ్మును దోచుకున్న దొంగలను శిక్షిస్తాం,నయా పైసలతో సహా కక్కిస్తాం: మంత్రి పొంగులేటి!!

పేదల సొమ్మును దోచుకున్న దొంగలను శిక్షిస్తాం,నయా పైసలతో సహా కక్కిస్తాం: మంత్రి పొంగులేటి!!

ఖమ్మం : ఆదివారం ఖమ్మం ఐడిఒసిలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి,సిపి.సునీల్ దత్ తో కలిసి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు,ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇటీవల వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇండ్లు కోల్పోయిన బాధితులతో ముఖాముఖి మాట్లాడానని వారి కష్టాలను స్వయంగా విని చలించిపోయానని అన్నారు,
అప్పులు చేసి నిర్మించుకున్న ఆశల గూడు కూలిపోయిందని ఆవేదన చెందకండి,ఈ ప్రభుత్వం మీది,మీ కన్నీరు తుడిచే బాధ్యత నాది,అర్హులైన ప్రతి పేదవాడికి ఈ నెల 15వ తేదీలోపు ఇళ్ల స్థలాల పట్టాలతో పాటు రూ. 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెలుగుమట్ల బాధితులకు భరోసానిచ్చారు……

ఈ సందర్భంగా ​వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నివాసాలు కోల్పోయిన బాదితులు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా దళారుల ఉచ్చులో చిక్కి నరకయాతన పడ్డామని,తక్కువ ధరకే స్థలం వస్తుందని నమ్మి రెక్కాడితే గానీ డొక్కాడని మేము 30 వేల నుంచి రూ. 8 లక్షల వరకు అప్పులు చేసి దళారులకు చెల్లించామని మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు,అష్ట కష్టాలుపడి తీరా ఇల్లు కట్టుకున్నాక అధికారులు వచ్చి కూల్చేయడంతో తామంతా దిక్కుతోచని స్థితిలో పడ్డామన్నారు,ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి ఒక్క పైసా కూడా ఎవరికీ లంచం ఇవ్వాల్సిన పనిలేదని, పేదల రక్తం తాగిన ఆ దళారుల నుంచి డబ్బును రికవరీ చేయిస్తామని బాధితులకు గట్టి హామీ ఇచ్చారు…..

అదే విధంగా ​గత 9 నెలలుగా కరెంటు, నీరు, ఇతర మౌలిక సదుపాయాలు లేక చీకట్లో మగ్గుతున్నామని బాధితులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు,దీనిపై స్పందించిన మంత్రి కేవలం ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడమే కాకుండా, కొత్తగా నిర్మించే కాలనీల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని,రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీతో పాటు అంగన్వాడీ, పాఠశాలలను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు ,నియోజకవర్గాల వారిగా బాధితులను గుర్తించి,
వారి వారి ప్రాంతాల్లోనే గౌరవప్రదమైన పునరావాసం కల్పిస్తామని స్పష్టం చేశారు…..

అంతే కాకుండా బాధితుల సానుభూతి కోసం పాకులాడుతున్న ప్రతిపక్ష నేతలపై మంత్రి పొంగులేటి నిప్పులు చెరిగారు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఈ పేదలు గుర్తుకు రాలేదా అని నిలదీశారు, అధికారం పోగానే షెడ్ల కింద కూర్చుని డ్రామాలు ఆడుతున్నారని, రాజకీయాల కోసం పేదలను కవచంలా వాడుకోవడం మూర్ఖత్వమని మండిపడ్డారు, మీ పార్టీ ఏదైనా సరే.. మీరు నిజమైన పేదలైతే ఈ ప్రభుత్వం మీకు ఇల్లు ఇచ్చి తీరుతుందని, రాజకీయాలకు అతీతంగా పారదర్శకమైన సర్వే ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ప్రకటించారు…..

​గతంలో లబ్ధి పొందిన వారిని ఏరివేసి, కేవలం నిరుపేదలకే న్యాయం జరిగేలా సమగ్ర సర్వే నిర్వహిస్తున్నామన్నారు,
ఈ నెల 15వ తేదీన తానే స్వయంగా వచ్చి అర్హులైన కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందజేస్తానని మంత్రి భరోసా ఇచ్చారు,అధికారులే నేరుగా బాధితుల వద్దకు వస్తారని,మరోమారు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు,ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ మట్టా దయానంద్ తదితరులు పాల్గొన్నారు....