Janam Muchata – Voice of the People | Telugu News Platformసైబర్ క్రైమ్ ముఠా నాయకుడు ఉడతనేని సాయి వికాస్ చౌదరి… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 13 Aug 2026, 7:25 am
Date of Publish : 24 Feb 2026, 8:56 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 1030 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

సైబర్ క్రైమ్ ముఠా నాయకుడు ఉడతనేని సాయి వికాస్ చౌదరి అరెస్ట్ !!

సైబర్ క్రైమ్ ముఠా నాయకుడు ఉడతనేని సాయి వికాస్ చౌదరి అరెస్ట్ !!

గత నెల రోజుల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన
అంతర్జాతీయ సైబర్ నేరాల కేసులో కీలక నిందితుడు ఉదతనేని సాయి వికాస్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు,ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కల్లూరు ఏసిపి వసుంధర యాదవ్ వివరాలను వెల్లడించారు,సాయి వికాస్ చౌదరితో పాటు అతని భార్య నాగ ప్రియను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు…..

వివరాల్లోకి వెళితే 2022 వ సంవత్సరం నుండి విదేశీ పౌరులను టార్గెట్ గా చేసుకుని అక్కడ కొంతమంది వ్యక్తులతో పరిచయాలు ఏర్పాటు చేసుకుని కాల్ సెంటర్లు నడుపుతూ మన దేశ పౌరులకు పోన్లు చేయిస్తూ క్రిప్టో ట్రేడింగ్, గేమింగ్ బెట్టింగ్,ఓటిపి మోసాలు చేయడమే కాకుండా వివాహ సంబంధాలు కుదిర్చే మ్యాట్రిమోనీల పేరుతో పోన్లు చేసి అధిక లాభాలు చూపి వారి ఆఫర్లకు ఆకర్షితులైన వారిని వారు నిర్వహించే టెలిగ్రాం గ్రూపుల్లో యాడ్ చేసి వారికి వివిధ రకాల లింకులు,క్యూఆర్ కోడ్స్ పంపిస్తూ వారి ఎకౌంట్ల నుండి డబ్బులను కాజేసేవారిని ఏసిపి పేర్కొన్నారు…..

అంతే కాకుండా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేస్తున్నామని,వివిధ బ్యాంకుల్లో ఎకౌంట్లు అవసరం ఉందని చెప్పి నమ్మించి ఏజెంట్లకు భార్య నాగప్రియ ద్వారా కమీషన్ ఇప్పించి ఇతరుల చేత ఎకౌంట్లు తెరిచి వారికి నెలకు పది వేల రూపాయల నుండి యాభై వేల రూపాయల వరకు ఇచ్చి దాదాపు ఇరవై రెండు మందితో ఎకౌంట్లు తెరిపించినట్లు నేరం అంగీకరించాడని ఏసిపి వసుంధరా యాదవ్ తెలిపారు….

అంతే కాకుండా సాయి వికాస్ చౌదరి,బార్య నాగప్రియలతో పాటు అడపా రామ్ వెంకట్ చౌదరి,అడపా సూర్య వెంకట తరుణ్,ఇలాసరపు అనిరుద్, పోట్రూ వంశీ,పోట్రూ చైతన్య సాయి,దోసపాటి నవీన్, నల్లబోతుల భవాని,కాపుగంటి జోగేంద్ర శేషు, దేవుళ్ళ వేణు,మామిడిశెట్టి సాయి,పఠాన్ ఇమ్రాన్ ఖాన్,ఉప్పతల గోపి,దొబ్బల వెంకటేష్ లను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించగా మరో ఎనిమిది పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో సత్తుపల్లి సీఐ శ్రీహరి,వి.యం.బంజర సిఐ ముత్తిలింగంతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.....