Janam Muchata – Voice of the People | Telugu News Platformఖమ్మం భూదాన్ భూముల్లో ఆక్రమణలు తొలగించిన రెవెన్యూ అధికారులు!! › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 13 Aug 2026, 6:36 am
Date of Publish : 24 Feb 2026, 6:27 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 2635 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

ఖమ్మం భూదాన్ భూముల్లో ఆక్రమణలు తొలగించిన రెవెన్యూ అధికారులు!!

ఖమ్మం భూదాన్ భూముల్లో ఆక్రమణలు తొలగించిన రెవెన్యూ అధికారులు!!

ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని 147,148,149 సర్వే నెంబర్లలో దాదాపు 31.0 ఎకరాల భూదాన్ భూముల్లో గత కొన్ని సంవత్సరాలుగా UCCRI (ML) పార్టీ గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం, సూర్యాపేట,నల్గొండ జిల్లాలనుండి వలస వచ్చిన దాదాపు ఆరు వందల కుటుంబాలు ఇక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని బ్రతుకుతున్నారు, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈరోజు ఉదయం అక్రమంగా నివసిస్తున్నారంటూ రెవెన్యూ,పోలీసు అధికారులు అక్కడ నివసిస్తున్న వారిని ఖాళీ చేయించారు….

నివాసాలను ఖాళీ చేయించే క్రమంలో ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పెద్ద ఎత్తున పోలీసులు బలగాలను మోహరించారు,ఖమ్మం జిల్లా పోలీసులే కాకుండా పక్కన ఉన్న భద్రాద్రి కొత్తగూడెం,మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుండి కూడా అదనపు బలగాలను రప్పించారు,దాదాపు నాలుగు వందల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు,రెవెన్యూ,పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించినప్పటికీ కాలనీ వాసుల నుండి ఎటువంటి ప్రతిఘటన ఎదురవ్వలేదు,అధికారులు సూచించిన దాని ప్రకారం ప్రజలు తమ నివాసాలను స్వచ్ఛందంగా ఖాళీ చేశారు….

ఈ మొత్తం వ్యవహారంలో అమాయక పేదలే సమిధలుగా మారారు,కొంతమంది వామపక్ష నాయకులు కమిటీల పేరుతో కోట్ల రూపాయలు బాదితుల దగ్గర వసూళ్లు చేశారని వాపోతున్నారు,ఈ మధ్య కాలంలోనే ఐదు లక్షలు రూపాయలు చెల్లించి వంద గజాలు కొనుక్కున్నానీ ఓ మహిళా కన్నీరు మున్నీరవుతూ ఫోన్ పేల దారా నాయకుల చెల్లించిన డబ్బు తాలుకు లావాదేవీలను చూపిస్తూ బోరున విలపించింది,మరో బాధితుడు కొంత మంది నాయకుల మాటలు నమ్మి ఆడపిల్ల పెళ్లి కోసం దాచుకున్న పదిలక్షల రూపాయలు వెచ్చించి నూట యాభై గజాలు కొనుగోలు చేశానని మీడియా ముందు కంటతడి పెట్టుకున్న సంఘటన హృదయాలను కలచి వేసింది….

ఇండ్ల స్థలాలు కొనుగోలు చేసేటపుడు మీకోసం మా ప్రాణాలైనా ఇస్తాం,మీ స్థలాలు ఎక్కడికి పోవంటూ నాయకులు చెప్పిన మాయ మాటలు నమ్మి తిని తినక,కడుపు అయగట్టుకుని అహర్నిశలు శ్రమించి,నిలువ నీడకోసం లక్షలు రూపాయలు దారబోసి స్థలాలు కొనుగోలు చేస్తే తీరా ప్రభుత్వ అధికారులు స్థలాలను స్వాధీనం చేసుకోవడానికి వచ్చినపుడు ఏ నాయకుడు కనబడటం లేదని,అందరూ పోన్లు స్విచ్ ఆఫ్ సుకున్నారంటూ బాదితులు ఆగ్రహం వ్యక్తం చేసారు,ఈ సందర్భంగా కొంతమంది బాధితులు మీడియాతో మాట్లాడుతూ మా దగ్గర అక్రమంగా వసూళ్లు చేసిన నాయకులపై ఆధారాలతో కేసులు పెడతామని దయచేసి పోలీసు అధికారులు తగిన న్యాయం చేయాలంటూ పోలీసు అధికారులను గద్గద స్వరంతో వేడుకున్నారు.....

ఏది ఏమైనప్పటికి నాయకుల మాటలు నమ్మి మోసపోయి నిలువ నీడ లేకుండా బ్రతుకులు బజారున పడ్డాయని,తెలియని అమాయకత్వంలో స్థలాలు కొనుగోలు చేసి నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం వేరెక్కడైన నివాస స్థలాలు ఇచ్చి అందుకోవాలని బాదితులు కోరుతున్నారు, ఆక్రమణలు తొలగించిన నేపథ్యంలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగక పోవడంతో రెవెన్యూ పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది….,