Janam Muchata – Voice of the People | Telugu News Platformఒక్కో ప్లాట్ నలుగురికి బేరం!?…పువ్వాడ ఉదయ్ నగర్ అక్రమ ప్లాట్ల… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 13 Aug 2026, 4:07 am
Date of Publish : 23 Feb 2026, 6:13 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 1446 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

ఒక్కో ప్లాట్ నలుగురికి బేరం!?…పువ్వాడ ఉదయ్ నగర్ అక్రమ ప్లాట్ల దందా రెండవ భాగం!!

ఒక్కో ప్లాట్ నలుగురికి బేరం!?…పువ్వాడ ఉదయ్ నగర్ అక్రమ ప్లాట్ల దందా రెండవ భాగం!!

రఘునాథపాలెం మండలం పువ్వాడ ఉదయ్ నగర్లో తాజా మాజీల అక్రమ ప్లాట్ల దందాకు సంబంధించిన నకిలీ ఇండ్ల పట్టాలు ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన "ఎపిస్టీయన్ ఫైల్స్"లాగా తవ్వే కొద్ది గుట్టలు గుట్టలుగా బయట పడుతున్నాయి,పొట్ట చేతబట్టుకుని బ్రతుదెరువు కోసం పువ్వాడ ఉదయ్ నగర్లో అడుగుబెట్టిన సదరు వ్యక్తులు పైకి శత్రువులుగా నటిస్తూనే పేదల పొట్టగొట్టి వందల కోట్లల్లో ఆస్తులు సంపాదించారు,ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యారు ప్రభుత్వ భూముల దోపిడీకి రహదారులు ఏర్పరుచుకున్నారు,రాజకీయ నాయకులు,గత రెవెన్యూ అధికారుల అండదండలతో చెలరేగిపోయిన తోడు దొంగలు ఒక్కొక్క ప్లాటును ఇద్దరి నుండి ఐదుగురు దాకా అమ్మినట్లు ఆధారాలు లభించాయి,దాదాపు రెండు వందల ప్లాట్లను ఇద్దరి నుండి ముగ్గురికి అమ్మేసి ఒక్కొక్కరి దగ్గర మూడు నుండి నాలుగు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు మోసపోయినా బాధితులు చెప్పడం విశేషం....

2009 వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం,ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఖమ్మం పట్టణంలో నివసించే పేదల కోసం కేవలం 298 మందికి ఇండ్ల పట్టాలు మంజూరి చేశారు కానీ 2013 లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా ఎన్నికైన కొందరు వ్యక్తులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోయచలక రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 192 లో వందల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని దురాక్రమణ చేసి ఆనాటి ప్రభుత్వం మంజూరు చేసిన 298 ప్లాట్లను ఆరు వేల ప్లాట్లుగా మార్చేసి అమాయకులైన ప్రజలు అంటగట్టి సదరు తాజా, మాజీలు వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారు,తాయత్తులు కట్టే స్థాయి నుండి ఒకరు,సెంట్రింగ్ మేస్త్రిగా ఒకరు జీవన ప్రయాణం మొదలు పెట్టిన సామాన్య వ్యక్తులు ప్రభుత్వ భూములను అమ్ముకుని,పేదల చెమట చుక్కల పునాదుల మీద విలాసవంతమైన భవనాలు నిర్మించుకుని లగ్జరీ కారుల్లో తిరుగుతున్నారండంలో అతిశయోక్తి లేదు…..

నాడు ఆయన దోపిడి చేసినా,నేడు ఈయన దోపిడి చేసినా దానికి వెనుక ఉన్నది కచ్చితంగా బడా రాజకీయ నాయకులేనన్నది నిర్వివాదాంశం,నాడు మంత్రి దగ్గర కీలకమైన వ్యక్తులు అండదండలు అందిస్తే నేడు కూడా మంత్రి దగ్గర కీలకంగా వ్యవహరించే వ్యక్తుల అండదండలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది,ముఖ్యంగా ఆనాటి రెవిన్యూ అధికారులు, తహసీల్దారులు,కొంతమంది వీఆర్వోల సహాయ సహకారాలతో ఈ ద్వయం ఏదెచ్చగా అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు లభించాయి,ఒక మాజీ సర్పంచ్ మూడు వందల గజాల్లో విలాసవంతమైన భవనం నిర్మించుకుంటే సదరు వ్యక్తికి అక్రమ నిర్మాణం అంటూ 2022 లో ఓ తహసీల్దార్ నోటీసులు ఇస్తే ఇప్పటి వరకు కూడా ఆ నోటీసుల సంగతి ఏమైందో కూడా అంతు చిక్కని పరిస్థితి….

ముఖ్యంగా 2008 సంవత్సరంలో ఆనాటి కలెక్టర్ శశిభూషణ్ కుమార్ కేతారపు వరలక్ష్మి పేరు మీద ఇంటి పట్టా ఇచ్చారు,
కానీ ఆ స్థలానికి నకిలీ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ సృష్టించి,ఇంటి నెంబరు,కరెంట్ మీటరు కూడా మంజూరి చేయించి వేరొకరికి సదరు ద్వయం అమ్మడం,కొనుక్కున్న వ్యక్తి పక్కా ఇండ్లు నిర్మించడం చక చకా జరిగిపోయింది, విషయం తెలుసుకున్న అసలు పట్టదారు అక్కడకు వెళ్ళి అడిగితే తాజా,మాజీలు ఇద్దరు తమ అనుచరులను ఉసిగొల్పి దాడికి యత్నించినట్లు సదరు మహిళ వాపోయింది,ఇదే విషయం మీద ఎన్నిసార్లు కలెక్టర్ ,ఆర్డీవోకి, తహసీల్దార్ కు పిర్యాదు చేసిన పట్టించుకున్న నాధుడు లేడంటూ కన్నీటి పర్యంతమైంది,చివరకు మంత్రి తుమ్మల ముందు తన గోడు వెల్లబుచ్చుకున్న ఫలితం శూన్యమని వాపోయింది….

ఈ మొత్తం వ్యవహారంలో వీళ్ళకు అండదండలు అందించిన రాజకీయ నాయకులు ఎవరు? ఈ అక్రమాలకు వెన్నుదన్నుగా నిలచిన గత తహసిల్దారులు,వీఆర్వోలు ఎవరు ? ఎన్ని వందల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని అమ్ముకున్నారు,ఈ దందా మీద నోరెత్తకుండా ఎవరెవరికి ఎన్ని ప్లాట్లు ఇచ్చారు ?ఎవరెవరు ఎంత సంపాదించారు,ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారు అనే విషయం మీద పూర్తి డాక్యుమెంటరీ ఆధారాలతో రేపటి ఎపిసోడ్లో మీ "జనం ముచ్చట"లో….