Janam Muchata – Voice of the People | Telugu News Platformఏడాదికి మూడు లక్షల ఇళ్లు మంజూరు చేయండి, కేంద్ర మంత్రి… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 13 Aug 2026, 8:29 am
Date of Publish : 21 Feb 2026, 5:50 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 336 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

ఏడాదికి మూడు లక్షల ఇళ్లు మంజూరు చేయండి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు మంత్రి పొంగులేటి విజ్ఞప్తి!!

ఏడాదికి మూడు లక్షల ఇళ్లు మంజూరు చేయండి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు మంత్రి పొంగులేటి విజ్ఞప్తి!!

కేంద్ర వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర పర్యటన సందర్భంగా శనివారం హైదరాబాద్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కేంద్ర మంత్రితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు,ఈ సందర్భంగా రాష్ట్రంలో గృహ నిర్మాణానికి సంబంధించి ప‌లు అంశాల‌ను ఆయన దృష్టికి తెచ్చారు,ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు,ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా 2014-23 వరకు దాదాపు ప‌ది సంవ‌త్స‌రాల‌లో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో పేద‌ల ఇండ్ల నిర్మాణం జ‌ర‌గలేదనీ దీంతో ఇండ్ల నిర్మాణానికి ప్ర‌జ‌ల నుంచి భారీ ఎత్తున డిమాండ్ ఏర్పడిందని,దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి అవ‌స‌ర‌మైన ఇండ్ల‌ను మంజూరు చేయాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీ‌నివాస‌ రెడ్డి కేంద్ర‌ ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు,...

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ పేదల సంక్షేమాన్ని విస్మరించిన గత ప్రభుత్వం పది సంవత్సరాలల్లో కేంద్రం నుండి ఒక ఇల్లు కూడా తీసుకురలేక పోయిందని, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు గ్రామీణ ప్రాంతాలకు ఇండ్లు మంజురు చేయాలని గడిచిన రెండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వానికి పదేపదే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నామని కానీ కేంద్రం నుంచి సానుకూల స్పందన కరువైందని, కనీసం ఈ ఆర్థిక సంవత్సరంలోనైనా గ్రామీణ ప్రాంతాలకు 3 లక్షల ఇండ్లు మంజురు చేయాలని కేంద్రాన్ని కోరారు,గత ప్ర‌భుత్వం రాష్ట్రంలో గృహ‌ నిర్మాణాన్ని పూర్తిగా నిర్ల‌క్ష్యం చేసిందనీ,పది సంవత్సరాల పాలనలో సంవత్సరానికి కనీసం పదివేల ఇండ్లను కూడా నిర్మించలేదనీ అన్నారు,ఈ ప‌రిస్ధితుల‌ నేపథ్యంలో రెండేళ్ల క్రితం రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం పేద‌ల ఇండ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్య‌త ఇస్తోందనీ,వ‌చ్చే మూడు సంవ‌త్స‌రాల‌లో రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇండ్లు నిర్మించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుందనీ ఇప్పటికే ఈ ఏడాది దాదాపు నాలుగు లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజురు చేయడం జరిగిందనీ,కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తే ఈ కార్యక్రమం మరింత వేగవంతం చేస్తామని పేర్కొన్నారు…..

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి సర్వేలో అర్హులైన లబ్ధిదారుల డేటాబేస్‌ను సిద్ధం చేసుకుందనీ,అయినప్పటికీ, కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఆవాస్+2024 మొబైల్ యాప్ ద్వారా మరోసారి సర్వే నిర్వహించి మొత్తం 11.57 లక్షల అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించడం జరిగిందనీ,తెలంగాణ రాష్ట్రంలో గత 12 ఏళ్లలో ఏర్పడిన పెండింగ్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలోని పరిస్థితులను అర్థం చేసుకొని ఈ ఆర్థిక సంవత్సరములో 3 లక్షలు, వచ్చే ఏడాది మరో రెండు లక్షల ఇండ్లను మజూరు చేయాలని మంత్రి పొంగులేటి గారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి విజ్ఞప్తి చేశారు,పేద కుటుంబాలకు సురక్షితమైన, గౌరవప్రదమైన నివాసాన్ని కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని,పేదలకు సొంతింటి కల నెరవేర్చడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సంకల్పమని, ఈ లక్ష్య సాధనలో కేంద్రం సానుకూలంగా స్పందింస్తుందని మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు……