జనం ముచ్చట,ఖమ్మం జిల్లా:
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక కేంద్రీయ విద్యాలయం సమీపంలో సర్వే నెంబర్ 101లో ఉన్న సీలింగ్ భూములపై కబ్జా దారుల కన్నుపడింది,దీంతో రాత్రికి రాత్రి కొందరు అక్రమ నిర్మాణాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారనే సమాచారం అందడంతో ఈరోజు ఉదయం రూరల్ మండల రెవెన్యూ అధికారులు ఆక్రమణలను అడ్డుకున్నారు….
ఆక్రమణదారులు నిర్మించిన పునాదులను కూలగొడుతున్న దృశ్యం.....
ఈ క్రమంలో రూరల్ మండలరెవెన్యూ అధికారి పిల్లి రాంప్రసాద్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ కేవీవి ప్రసాద్ ఆధ్వర్యంలో ఖమ్మం రూరల్ పోలీసుల సహకారంతో రెవెన్యూ సిబ్బంది జేసిబి సాయంతో అక్రమంగా నిర్మించిన పునాదులను తొలగించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు,స్వాధీనం సీలింగ్ భూమి విలువ దాదాపు రెండు కోట్లు ఉంటుందని రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు,ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గత కొంత కాలంగా కొందరు వ్యక్తులు ఏదులపురం మున్సిపాల్టీ పరిధిలో ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ అదే పనిగా వాటిని ఆక్రమించి చుట్టూ ప్రహరీ గోడలు నిర్మించి అమాయకులైన పేదలకు అమ్ముతూ ప్రజలను మోసం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు….
స్వాదీనం చేసుకున్న భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారులు....
అంతే కాకుండా ప్రభుత్వ భూములు ఆక్రమణతో పాటు ప్లాట్లు,ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే విషయం రెవెన్యూ శాఖ దృష్టికి వచ్చిందని అలాంటి వారి మాటలు నమ్మి నిరుపేదలు ప్రభుత్వ భూములను కొని మోసపోవద్దని అన్నారు, అదే విధంగా ప్రభుత్వ భూములను దురాక్రమణకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని,అదే పనిగా ప్రభుత్వ భూములను కబ్జాలకు పాల్పడుతున్న కొందరు వ్యక్తులను గుర్తించామని రెండు మూడు రోజుల్లో వారిపై కేసులు నమోదు చేయబోతున్నామని రూరల్ తహసీల్దార్ తెలిపారు…
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456