Janam Muchata – Voice of the People | Telugu News Platform › కౌన్ బనేగా చైర్మన్? అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్ !! › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 ✈ in @ ✉
janammuchata.in 09 Oct 2026, 8:14 pm
Date of Publish : 16 Feb 2026, 9:55 am  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 276 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

కౌన్ బనేగా చైర్మన్? అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్ !!

కౌన్ బనేగా చైర్మన్? అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్ !!

ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన ఏదులాపురం,మధిర,అశ్వారావుపేట,కల్లూరు, సత్తుపల్లి మున్సిపాలిటీల చైర్మన్ ఎన్నిక విషయంలో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొని ఉంది, ముఖ్యంగా ఎదులాపురం మున్సిపల్ ఛైర్ పర్సన్ విషయానికొస్తే ఎస్సీ మహిళకు రిజర్వు కావడం, నలుగురు ఎస్సీ మహిళలు కౌన్సిలర్లుగా గెలుపొందడం,నలుగురిలో ముగ్గురు ఉన్నత విద్యావంతులు కావడంతో చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వవాలనే అంశంపై మీమాంస కొనసాగుతుంది, దీంతో పాటు మాల, మాదిగ సమీకరణలు కూడా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది,మాల సామాజిక వర్గం నుండి పోకబత్తిన అనిత,మాదిగ సామాజిక వర్గం నుండి గొడ్డుగోర్ల కృష్ణ కుమారి,
కోటమర్తి సునీత, కందుకూరి శేషమ్మ కౌన్సిలర్లుగా గెలుపొందడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ,మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఎవరి వైపు మొగ్గు చూపుతారనే అంశం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది….

మధిర మున్సిపల్ చైర్మన్ పదవి కోసం సామినేని సునీత, వేమిరెడ్డి లక్ష్మీ తులసి మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది,దీంతో మల్లు భట్టి విక్రమార్క ఏవిధమైన నిర్ణయం తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది,మొదటి నుండి మధిర నియోజకవర్గంలో భట్టి విక్రమార్క రాజకీయ ఎదుగుదలకు దోహదం చేసిన రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తారా?... లేక భవిష్యత్తు న్నికల్లో తెలుగుదేశం పార్టీ,కమ్మ సామాజిక వర్గం ఓట్లను దృష్టిలో పెట్టుకుని కమ్మ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తారా అనే విషయంపై మధిర ప్రజల్లో ఆసక్తి నెలకొంది…..

కల్లూరు మున్సిపాలిటీ చైర్మన్ సీటు ఎస్టీ జనరల్ కు రిజర్వు కావడంతో ఎస్టీ కౌన్సిలర్లు బారీ సంఖ్యలో గెలుపొందారు,ప్రధానంగా భూక్యా రాంబాబు,బానోతు మరోనీ, ధరావత్ మోహన్ నాయక్ ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది ఎవరికి వారు చైర్మన్ పదవి మాకే దక్కుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు,ఏది ఏమైనా కల్లూరు మున్సిపాలిటీ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సొంత గడ్డ కావడంతో ఆయన ఎవరినీ సూచిస్తే వారికే చైర్మన్ పదవి వరిస్తుందని ప్రజలు భావిస్తున్నారు…..

సత్తుపల్లికి మునిసిపల్ చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో చైర్మన్ పీఠం దక్కించుకోవడం కోసం ప్రధానంగా ముగ్గురు కౌన్సిలర్లు పోటీ పడుతున్నారు,తోట సుజలరాణి,బొంతు సుమలత,ఎండీ రెహనాబేగంల మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది,దీంతో అధిష్ఠానం ఎవరివైపు మొగ్గు చూపుతుందోననే అంశంపై పార్టీ కార్యకర్తల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతుంది,సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన వారిలో ప్రధానంగా ఆరవ వార్డు నుంచి తోట సుజలారాణి, మూడు వార్డు నుంచి ఎన్నికైన బొంతు సుమలత, 22వ వార్డు నుంచి గెలుపొందిన ఎండీ. రెహెనా బేగంలు గెలుపొందగా,తోట సుజలారాణికి గతంలో మూడుసార్లు కౌన్సిలర్‌గా ఎన్నిక కాగా పాలకవర్గంలో వైస్ చైర్‌పర్సన్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. రెహెనాబేగం 2005లో కౌన్సిలర్‌గా పని చేశారు. బొంతు సుమలత మొదటిసారి పోటీచేసి కౌన్సిలర్‌గా గెలుపొందారు,తనకు ఉన్న అనుభవం కారణంగా చైర్‌పర్సన్‌గా అవకాశం ఇవ్వాలని తోట నుజలారాణి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని బలంగా కోరుతున్నట్లు తెలుస్తుంది ,ఆమె నామినేషన్ వేసిన నాటి నుంచి చైర్‌పర్సన్‌ రేసులో ఉన్నారనే ప్రచారం సాగింది, ఏది ఏమైనా మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు ఎవరి భవితవ్యం ఏమిటనేది తెలియబోతుంది……