Janam Muchata – Voice of the People | Telugu News Platform › నమ్మకానికి ప్రతీక,మంత్రి పొంగులేటి క్యాంప్ ఆఫీస్ ఇంచార్జీ “దయాకర్ రెడ్డి”… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 ✈ in @ ✉
janammuchata.in 09 Oct 2026, 7:46 pm
Date of Publish : 10 Feb 2026, 10:51 am  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 583 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

నమ్మకానికి ప్రతీక,మంత్రి పొంగులేటి క్యాంప్ ఆఫీస్ ఇంచార్జీ “దయాకర్ రెడ్డి” జన్మదినంపై “జనం ముచ్చట”ప్రత్యేక కథనం!!

నమ్మకానికి ప్రతీక,మంత్రి పొంగులేటి క్యాంప్ ఆఫీస్ ఇంచార్జీ “దయాకర్ రెడ్డి” జన్మదినంపై “జనం ముచ్చట”ప్రత్యేక కథనం!!

ఒక రాజ్యం సుభిక్షంగా ఉండాలన్న,రాజ్యాన్ని శత్రు దుర్భేద్యమైన కోటలా నిర్మించాలన్నా ఆ రాజ్యం యొక్క మంత్రి సమర్ధత మీద ఆధారపడి ఉంటుంది,సరిగ్గా అలాంటి సమర్ధతను పుణికి పుచ్చుకుని పొంగులేటి సామ్రాజ్యంలో గత పదిహేనేండ్లుగా ప్రణాళికా దక్షత,స్పష్టమైన దిశ,నిర్ణయ సామర్థ్యం,జిల్లా రాజకీయాల మీద పూర్తి స్థాయి పట్టు, ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ డేటా ఆధారిత నిర్ణయాలు,సమయపాలన,పారదర్శకత,అవినీతి రహిత ధోరణి, ప్రజలతో నేరుగా సంబంధాలతో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాజకీయ సామ్రాజ్యాన్ని పెట్టని కోటలా నిలిచిన ఏకైక వ్యక్తి,మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయం ఇంచార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి....

ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఆయన పేరు తెలియని కార్యకర్త లేడంటే ఆశ్చర్యం కలగక మానదు,ఎనిమిది సంవత్సరాల పాటు ఆయన అడుగులో అడుగేసి నడిచిన వాడిగా ఒక మాట గర్వంగా చెప్పగలను అదేమిటంటే ?ఆయన మైండ్ ఒక నడిచే డిక్షనరి ఎందుకు ఆ మాట వాడాల్సి వచ్చిందంటే ?ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పది నుండి ఇరవై మందిని పేరు పెట్టీ పిలువగల జ్ఞాపక శక్తి ఆయన సొంతం,ఒకవైపు పిడుగులు పడుతున్న, మరోవైపు ప్రళయం ముంచుకొస్తున్న మన దాకా వచ్చాక చూద్దాంలే అనే గుండె నిబ్బరం ఆయనకు పెట్టని కిరీటం, పేరుకు తగ్గట్లుగానే దయార్ధ హృదయం,పరోపకారం ఆయన నైజం,నాకు తెలిసి ఆయన మాటల వల్లనో,ఆయన చేతల వల్లనో నొచ్చుకున్న కార్యకర్త లేడంటే అతిశయోక్తి కాదు,తన దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని,ప్రతి సమస్యను వీలైనంత త్వరగా దాన్ని పరిష్కరించాలని తపన ఆయనలో నిత్యం కనిపిస్తుంది…..

ఒక మంత్రికో,ఎమ్మెల్యేకో పిఏనో,పీఆర్వో అయితేనో…
అంతా నావల్లనే మంత్రి, ఎమ్మెల్యే వ్యవస్థలు నావల్లనే నడుస్తున్నాయనే భ్రమలో,బండి క్రింద కుక్క చందంగా వ్యవహరిస్తూ కార్యకర్తల పోన్లు లిఫ్ట్ చేయకుండా బిల్డప్పులు కొట్టే పిఏలు,పీఆర్వోలు ఉన్న ప్రస్తుత రాజకీయాల్లో అర్ధరాత్రి,అపరాత్రి అని చూడకుండా, కనీసం విసుగు పడకుండా కార్యకర్తల పోన్లు లిఫ్ట్ చేసి వారి సమస్యలను సావధానంగా విని పరిష్కార మార్గం చూపించే దయాకర్ రెడ్డి గారి లాంటి వ్యక్తి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాజ్యానికి పెట్టని కోట లాంటివాడు అనడంలో ఎలాంటి సందేహాలకు తావులేదు….,

సామాన్య కార్యకర్త నుంచి ప్రజల వరకు ఎవరికి ఏ కష్టం వచ్చినా గుర్తొచ్చే మొదటి పేరు దయాకర్ రెడ్డి,మంత్రి పొంగులేటి దృష్టికి ఏ విషయాన్ని తీసుకెళ్లాలన్నా ఆయనే ఒక బలమైన వారధి,సమస్య చిన్నదైనా, పెద్దదైనా ఓపికగా విని, దాన్ని మంత్రి దగ్గరకు చేర్చి పరిష్కారం అయ్యే వరకు వెన్నంటే ఉండి భరోసా కల్పించడం ఆయన ప్రత్యేకత. "దయన్నకు చెబితే మంత్రికి చేరినట్టే ,పని జరిగినట్టే" అనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించారు, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి 2014 పార్లమెంటు ఎన్నికల గెలుపు నుండి 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచే వరకు కీలక పాత్ర ఆయనదే,నేడు అధికారానికి, సామాన్యుడికి మధ్య ఒక గట్టి వంతెనలా నిలబడి ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ జిల్లా ప్రజల గుండెల్లో తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకున్న
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం ఇంచార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి గారికి హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు….