Janam Muchata – Voice of the People | Telugu News Platformకాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి,అభివృద్ధి చేసే బాధ్యత మంత్రి పొంగులేటిది:… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 13 Aug 2026, 8:13 am
Date of Publish : 08 Feb 2026, 3:20 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 298 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి,అభివృద్ధి చేసే బాధ్యత మంత్రి పొంగులేటిది: తుంబూరు దయాకర్ రెడ్డి!!

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి,అభివృద్ధి చేసే బాధ్యత మంత్రి పొంగులేటిది: తుంబూరు దయాకర్ రెడ్డి!!

ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా
ఈ రోజు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం ఇంచార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి వివిధ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు,తొలుత స్థానిక మూడవ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి వెలుగు సైదమ్మ విజయాన్ని కాంక్షిస్తూ నాయుడుపేట కల్వరి మినిస్ట్రీస్ చర్చిలో
ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి,చర్చి ఫాదర్స్ ఆశీర్వాదం తీసుకున్నారు…..

ఈ సందర్భంగా దైవజనులను ఉద్దేశించి దయాకర్ రెడ్డి మాట్లాడుతూ ఒకనాడు భారత దేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం,అందరికీ సమాన ప్రాతిపదికన హక్కులు కలిగి ఉండేవని,ప్రజలు స్వేచ్ఛగా జీవించేవారని కానీ గత పదిహేను సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ పార్టీ మతోన్మాద రాజకీయాలను ప్రోత్సహిస్తూ, ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని కలుషితం చేస్తూ,అన్య మతస్తులపై భౌతిక దాడులు చేయిస్తూ,ఏవిధంగా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారని,గతంలో భారత దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు మత సామరస్యం వెల్లువిరిచేదని,ప్రస్తుతం దేశంలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదని,నిత్యం దేశంలో ఏదో ఒక చోట మతపరమైన దాడులు జరుగుతున్నాయని అన్నారు….

అదే విధంగా మతోన్మాద రాజకీయాలను తిప్పికొట్టాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని దయాకర్ రెడ్డి పేర్కొన్నారు, అంతే కాకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో మీ అందరి అభిమాన నాయకుడు,రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీ అందరి ఆశీర్వాదంతో అత్యధిక మెజారిటీతో పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించారని,మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజునుండే ఈ ప్రాంతాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మునుపెన్నడు జరగని విధంగా అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారనీ,మౌళిక సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని పెంచడం, తద్వారా ప్రజాభివృద్ధి జరగాలనే సదుద్దేశంతో ఈ ప్రాంతాన్ని మున్సిపాలిటీగా మార్చడం జరిగిందని అన్నారు…..

ఈ నెల పదకొండున జరిగే ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల్లో ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీనీ ఆదరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని,ఎదులాపురం మున్సిపాలిటీని అభివృద్ధి చేసే బాధ్యత మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిదని తెలిపారు,ఆ తరువాత 25 వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కడవ నవీన్ కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ గడగడపకు ప్రచారాన్ని నిర్వహించి,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు….