ఖమ్మం జిల్లా,మధిర:
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న డిప్యూటీ సీఎం. మల్లు భట్టి విక్రమార్క విస్తృతంగా ప్రచారం నిర్వహించారు, ఈ సందర్భంగా జరిగిన సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ నన్ను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి,ఈ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా సేవ చేసే అవకాశం కల్పించిన మధిర ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని,మీ రుణం తీర్చుకోవడమే నా ఏకైక లక్ష్యమని భావోద్వేగ భరితమైన వ్యాఖ్యలు చేశారు,మధిర కీర్తి ప్రతిష్టలను పెంచుతూ,మరో 50 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని,అద్భుతమైన పట్టణాన్ని నిర్మించే బాధ్యతను
నేను తీసుకుంటున్నానంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు…..
డిప్యూటీ సీఎం. మల్లు భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు....
అదే విధంగా హైదరాబాద్, అమెరికా తరహాలో మధిరలో అత్యున్నత వైద్య రక్షణ సదుపాయాలు కల్పిస్తామని,రెప్పపాటు కూడా కరెంటు పోకుండా అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం కృషి చేస్తానని, మధిర పట్టణాన్ని స్వచ్ఛమైన నగరంగా మార్చడం కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను వేగవంతం చేస్తున్నామని, మధిర పట్టణ విస్తరణ కోసం కీలకమైన ఔటర్ రింగ్ రోడ్డు పనుల కోసం ఇప్పటికే నిధులు జమ చేశామని పేర్కొన్నారు, అంతే కాకుండా మధిర పట్టణంలో
వర్షపు నీరు, మురుగు నీటి తరలింపు కోసం ప్రత్యేక మార్గాలు నిర్మిస్తూనే,వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం కోసం
రిటైనింగ్ వాల్ మరియు బ్రిడ్జిల నిర్మాణం చేపడుతున్నామని
భట్టి విక్రమార్క తెలియజేశారు…..
ప్రజలకు అభివాదం చేస్తున్న డిప్యూటీ సీఎం. మల్లు భట్టి విక్రమార్క...
మన బిడ్డలు పోటీ పరీక్షలకు మధిరలోనే సిద్ధమయ్యేలా
అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని,మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రత్యేక శిక్షణ,లోన్లు
మరియు ఇండస్ట్రియల్ పార్కులో స్థలాలు కేటాయిస్తామని,
ఇల్లు లేని పేద వాడికి ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేస్తామని,
మధిర పట్టణ ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఇబ్బంది పడుతున్న
డంపింగ్ యార్డ్ తొలగించి వైరా నది పరివాహక ప్రాంతాన్ని
పార్కులు, వాకింగ్ ట్రాక్‌లతో సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు……
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి భారీగా హాజరైన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.....
మధిర పట్టణంలో జరిగే అభివృద్ధి పనుల్లో వీసమెత్తు అవినీతి జరగకుండా నేనే స్వయంగా నాణ్యతను పర్యవేక్షిస్తానని,
అభివృద్ధి అంటే మధిర అన్నట్టుగా రాష్ట్రానికే రోల్ మోడల్‌గా నిలుపుతానని,ఈ మహాయజ్ఞంలో తోడుగా నిలిచేందుకు
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అభ్యర్థులను
భారీ మెజారిటీతో గెలిపించండి,మధిరను అభివృద్ధి చేసే బాధ్యత నాది అంటూ మధిర పట్టణ ప్రజలకు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు…..
Pathi Srinivasa Rao:9703973456