Janam Muchata – Voice of the People | Telugu News Platformవరంగల్ క్రాస్ రోడ్డులో నేను చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 12 Aug 2026, 3:03 am
Date of Publish : 07 Feb 2026, 7:13 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 294 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

వరంగల్ క్రాస్ రోడ్డులో నేను చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా చేసింది శూన్యం: మాజీ ఎమ్మెల్యే కందాల !!

వరంగల్ క్రాస్ రోడ్డులో నేను చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా చేసింది శూన్యం: మాజీ ఎమ్మెల్యే కందాల !!

ఎదులాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా
మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఈ రోజు సాయంత్రం స్థానిక వరంగల్ క్రాస్ రోడ్డులోని 28,29,30వ వార్డుల్లో సిపిఎం పార్టీ బలపర్చిన BRS పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూఇంటింటికి ఓటర్లను కలుస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు,ఈ సందర్భంగా నిర్వహించిన "రోడ్షో షోకు" ప్రజలనుండి బారీ స్పందన లభించింది, డప్పులు, కోలాటాలతో మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు…..

ఈ సందర్భంగా జరిగిన కార్నర్ మీటింగులో మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ తన హయాంలో వరంగల్ క్రాస్ రోడ్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని,ముఖ్యంగా కాలనీల్లో అన్ని బజార్లకు సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్లు నిర్మించానని,అదే విధంగా
పొన్నెకల్లు గ్రీన్ ఫీల్డ్ హైవే నుండి కరుణగిరి వరకు దాదాపు ఆరు కిలోమీటర్ల మేర రోడ్డు డివైడర్, సెంటర్ లైటింగ్ శాంక్షన్ చేయించానని అన్నారు,అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా గత BRS ప్రభుత్వంలో నేను చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా వచ్చిన వారు చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు,ఏది ఏమైనప్పటికి గతంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి చేసిన తప్పును పునరావృతం చేయకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ,ప్రజా సమస్యల కోసం పోరాడే BRS అభ్యర్థులను ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు….

అంతే కాకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దాటినా ఇచ్చిన హామీలను అమలు పరచడంలో విఫలం అయిందని విమర్శించారు,ప్రస్తుతం,తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని దానికి ఈ మధ్య జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలే నిదర్శనమని పేర్కొన్నారు,ప్రజల్లో స్పందన చూస్తుంటే కచ్చితంగా ఏదులాపురం మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు….