Janam Muchata – Voice of the People | Telugu News Platformఏదులాపురం మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరేస్తాం:మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 12 Aug 2026, 3:03 am
Date of Publish : 07 Feb 2026, 1:23 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 112 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

ఏదులాపురం మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరేస్తాం:మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి!!

ఏదులాపురం మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరేస్తాం:మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి!!

ఎదులాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా
మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఈ రోజు ఉదయం ముత్తగూడెం గ్రామంలోనీ 20,21 వ వార్డుల్లో సిపిఎం పార్టీ బలపర్చిన BRS పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటికి ఓటర్లను కలుస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు…..

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దాటినా ఇచ్చిన హామీలను అమలు పరచడంలో విఫలం అయిందని విమర్శలు చేశారు….

అదే విధంగా నాడు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అన్ని విధాలుగా కేసీఆర్ అభివృద్ధి చేస్తే నేడు అధికారం అనుభవిస్తున్న కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయడం చేతకాక కేసీఆర్ ను భూతులు తిట్టడం ద్వారా డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతుందని వ్యాఖ్యానించారు,ప్రస్తుతం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఏదులాపురం మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు….