Janam Muchata – Voice of the People | Telugu News Platformకాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి నిలదీయండి: ఓటర్లకు మాజీ… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 12 Aug 2026, 3:03 am
Date of Publish : 06 Feb 2026, 9:50 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 152 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి నిలదీయండి: ఓటర్లకు మాజీ ఎమ్మెల్యే కందాలా ఉపేందర్ రెడ్డి విజ్ఞప్తి!!

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి నిలదీయండి: ఓటర్లకు మాజీ ఎమ్మెల్యే కందాలా ఉపేందర్ రెడ్డి విజ్ఞప్తి!!

ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేంద్ రెడ్డి దూకుడు పెంచారు,ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు 8,10,11,12 వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు, సీపీఎం పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బారి మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసారు...…

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి
మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దొంగ 420 హామీలతో ప్రజలను నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిందని,కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి రెండేండ్లు దాటినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోయారని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు,అంతే కాకుండా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చి పేద ప్రజలను మోసం చేశారనీ విమర్శలు చేశారు….

బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుల పక్షాన నిలిచిన గొప్ప నాయకుడు "కేసీఆర్" అని,రైతులకు రైతు బంధు,రైతుభరోసా పథకాలు ఇచ్చి రైతుకు అండగా నిలిచిన ఆపద్బాంధవుడు కేసీఆర్ అని పేర్కొన్నారు,ఓట్ల కోసం అధికార కాంగ్రెస్ పార్టీ వాళ్లు మీ దగ్గరకు వచ్చినపుడు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొంగ హామీల గురించి నిలదీసి ప్రశ్నించాలని ఓటర్లను కోరారు..