Janam Muchata – Voice of the People | Telugu News Platformఈ గడ్డ మీద పుట్టినోడికి ఇక్కడ ప్రజల బాధలు తెలుస్తాయి:… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 13 Aug 2026, 4:53 am
Date of Publish : 06 Feb 2026, 9:31 am  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 201 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

ఈ గడ్డ మీద పుట్టినోడికి ఇక్కడ ప్రజల బాధలు తెలుస్తాయి: మాజీ ఎమ్మెల్యే కందాలా ఉపేందర్ రెడ్డి!!

ఈ గడ్డ మీద పుట్టినోడికి ఇక్కడ ప్రజల బాధలు తెలుస్తాయి: మాజీ ఎమ్మెల్యే కందాలా ఉపేందర్ రెడ్డి!!

ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాలా ఉపేందర్ రెడ్డి వివిద వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు,తొలుత 22 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గూడ సంజీవ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన బారి రోడ్ షోకి స్థానిక ప్రజల నుండి విశేషమైన స్పందన లభించింది, రోడ్లన్నీ "గులాబీ వర్ణాన్ని" సంతరించుకున్నాయి,స్థానిక మహిళలు,BRS, సిపిఎం కార్యకర్తలు డప్పు వాయిద్యాలు, కోలాటాలతో ఉపేందర్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు తరువాత 23 వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి అడ్డాకుల శారద విజయం కోసం స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి గడప గడపకు తిరుగుతూ,ఓటర్లను కలుస్తూ కారు గుర్తుకు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు…..

ఈ సందర్భంగా జరిగిన కార్నర్ మీటింగులో పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాలా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ పాలేరు గడ్డ మీద పుట్టిన నేను ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఎలా ఉంది,ఇపుడు బయట నుండి వచ్చిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో అర్ధం చేసుకోండి,నేను నిత్యం పాలేరు ప్రజలకు అందుబాటులో ఉన్నాను కానీ ప్రస్తుతం నాయకులు చుట్టపు చూపుగా వచ్చి వెళుతున్నారు,పరాయి బిడ్డను సంకన ఎత్తుకున్నంత మాత్రాన మన బిడ్డ అవుతాడా ? ప్రజలను ప్రశ్నించారు,మన బాధలు మన గడ్డ మీద పుట్టినోడికి తెలుస్థాయి కాబట్టి ఈ ఎన్నికల్లో స్థానికులైన BRS పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రజలను కోరారు,అదే విధంగా పదేండ్ల కేసీఆర్ పరిపాలనలో రైతులు,మహిళలు, వృద్ధులు సుఖసంతోషాలతో ఉన్నారని,కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అరకొర రైతు బంధు ఇచ్చి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, కనీసం రైతుకు యూరియా కూడా దొరికే పరిస్థితి లేదని విమర్శించారు.....

అదే విధంగా ఏ మున్సిపల్ ఎన్నికల్లో BRS పార్టీకి వామపక్షాలు మద్దతు ఇవ్వడంతో అధికార పార్టీకి వెన్నులో వణుకు మొదలైందని,వారి మాటలను,వారి చేష్టలను గమనిస్తే అధికార పార్టీ ఓటమిని అంగీకరించినట్లేనని,ఏదులాపురం మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు,BRS పార్టీతోనే ఏదులాపురం మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమని,ఈనెల 11 న జరగబోయే ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల్లో BRS, వామ పక్షాల అభ్యర్థులను గెలిపించాలని కోరారు,ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ మండల BRS పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్,మాజీ సుడా డైరెక్టర్ గూడ సంజీవ రెడ్డి పాల్గొన్నారు….