Janam Muchata – Voice of the People | Telugu News Platform › గెలుపే లక్ష్యం,అభివృద్దే మా నినాదం: పొంగులేటి ప్రసాద్ రెడ్డి!! › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 ✈ in @ ✉
janammuchata.in 10 Oct 2026, 12:27 am
Date of Publish : 06 Feb 2026, 12:40 am  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 247 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

గెలుపే లక్ష్యం,అభివృద్దే మా నినాదం: పొంగులేటి ప్రసాద్ రెడ్డి!!

గెలుపే లక్ష్యం,అభివృద్దే మా నినాదం: పొంగులేటి ప్రసాద్ రెడ్డి!!

ఏదులాపురం : మున్సిపల్ ఎన్నికల పోరులో కాంగ్రెస్ పార్టీ తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది,గురువారం సాయంత్రం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 23, 30వ వార్డుల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోదరుడు,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పొంగులేటి ప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది……

హోరెత్తిన రోడ్ షో.. అభ్యర్థులకు బ్రహ్మరథం...
23వ వార్డు అభ్యర్థిని పోకబత్తిని అనిత, 30వ వార్డు అభ్యర్థిని కొట్టం శిరీష గెలుపును ఆకాంక్షిస్తూ సత్యనారాయణపురం, వరంగల్ క్రాస్ రోడ్డు సెంటర్లలో భారీ రోడ్ షో నిర్వహించారు, ఈ సందర్భంగా ప్రసాద్‌రెడ్డి గడపగడపకూ వెళ్లి ఓటర్లను పలకరించారు,మహిళలు అడుగడుగునా మంగళహారతులతో అభ్యర్థులకు ఘనస్వాగతం పలకడం విశేషం….

ఈ సందర్భంగా జరిగిన కార్నర్ మీటింగులో పొంగులేటి ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలోనే అనేక ప్రజాహిత నిర్ణయాలు తీసుకుందని గుర్తుచేశారు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం,200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ లాంటి అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని,మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి చెందాలంటే హస్తం అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆయన కోరారు. "అధికార పార్టీ అభ్యర్థుల విజయంతోనే పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన, పేదలకు సంక్షేమ ఫలాలు వేగంగా అందుతాయి" అని ఆయన స్పష్టం చేశారు,ఏదులాపురం మున్సిపాలిటీనీ రాష్ట్రానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దే బాధ్యత మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిదని పేర్కొన్నారు….

అంతే కాకుండా తన ప్రసంగంలో BRS, వామ పక్షాలపై విరుచుకు పడ్డారు, పదేండ్ల కాలంలో ఏమి చేసారో చెప్పుకో లేక అధికార పార్టీపై బురద జల్లుతున్నారని,మీ పాలనలో నిరుపేదలకు ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా? ఒక్క ఇల్లు కట్టించారా అంటూ ప్రశ్నించారు,అదే విధంగా ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకోనిదే కనీసం మూడు సీట్లు కూడా గెలవలేని కమ్యూనిస్టులు అనైతిక పొత్తులు పెట్టుకొని అధికార పార్టీపై విమర్శలు చేయడం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు…..