Janam Muchata – Voice of the People | Telugu News Platform › “తమ్మినేని” కోటలో మంత్రి “పొంగులేటి” ఏకగ్రీవాల పాగా?? › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 ✈ in @ ✉
janammuchata.in 12 Oct 2026, 4:26 am
Date of Publish : 03 Feb 2026, 12:46 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 1909 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

“తమ్మినేని” కోటలో మంత్రి “పొంగులేటి” ఏకగ్రీవాల పాగా??

“తమ్మినేని” కోటలో మంత్రి “పొంగులేటి” ఏకగ్రీవాల పాగా??

అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల్లో పెను సంచలనం జరగబోతుందా అంటే జరుగుతున్న పరిణామాలనుబట్టి చూస్తే నిజమే అనిపిస్తుంది,ముఖ్యంగా సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం సొంత గ్రామం తెల్దారుపల్లి గ్రామంలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవం కానున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో గత పది సంవత్సరాల నుండి కక్షలు కార్పణ్యాలతో తెల్దారుపల్లి రగులుతూనే ఉంది ఆ క్రమంలోనే 2022 ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాడు నాటి BRS నాయకుడు తమ్మినేని కృష్ణయ్య కొంతమంది చేతిలో దారుణ హత్యకు గురయ్యారు,ఈ పరిణామంతో గ్రామ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి,దీంతో తమ్మినేని కృష్ణయ్య తనయుడు నవీన్ గ్రామంపై పూర్తి పట్టు సాధించాడు,ప్రస్తుతం తమ్మినేని నవీన్ కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తిగా,మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నాడు….

ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎదులాపురం మున్సిపల్ ఎన్నికల్లో నవీన్,తల్లి తమ్మినేని మంగతాయి చెరొక వార్డులో పోటీ చేస్తున్నారు,ఈ క్రమంలోనే వీరిద్దరి ఏకగ్రీవం కోసం సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రంతో పెద్ద స్థాయిలో మంతనాలు జరుగుతున్నట్లు,దాదాపు ఏకగ్రీవం ఖాయమైనట్లు ఓ కమ్యూనిస్టు సీనియర్ నాయకుడు"జనం ముచ్చట"తో తన అభిప్రాయాన్ని వెల్లడించారు,ఇప్పటికే కక్షలు కార్పణ్యాలతో గ్రామం అభివృద్ధికి దూరం అవుతుందనీ,ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయని తద్వారా గ్రామంలో అశాంతి నెలకుంటుందని, గ్రామంలో శాంతి నెలకుని ఎప్పటిలాగానే ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలనే భావనతో నవీన్ మంగతాయి ఏకగ్రీవానికి అభ్యంతరాలు చెప్పొద్దనే అభిప్రాయంలో తమ్మినేని వీరభద్రం ఉన్నట్లు సమాచారం,ఈ సమాచారం ఇంకా పూర్తిగా నిర్ధారణ కానప్పటికీ ఆ ఏకగ్రీవం దిశగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది,మధ్యాహ్నం రెండు గంటలకల్లా పూర్తీ సమాచారం వచ్చే అవకాశం ఉంది….

ఏది ఏమైనా రెండు కార్డులు ఏకగ్రీవం అయితే మాత్రం
నిత్యం రాజకీయ కక్షలతో అగ్ని గుండంలా రగిలిపోయే తెల్దారుపల్లి గ్రామంలో మున్సిపల్ ఎన్నికల్లో తమ్మినేని వీరభద్రం పెద్దరికంతో వ్యవహరించి పోటీ లేకుండా ఏకగ్రీవం చేయడానికి కృషి చేయడం అభినందనీయమైనా అంశమని,ఈ పరిణామంతో గ్రామంలో శాంతి కుసుమాలు విరబోసి గ్రామం అభివృద్ధి బాటలో నడవడం ఖాయమని గ్రామస్తులు అభిప్రాయ పడుతున్నారు…....