హైదరాబాద్ :Jan:31:1:2026
గత కొన్ని సంవత్సరాలుగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద, కేసీఆర్ కుటుంబం మీద విపక్షాలు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ పార్టీ ఇష్టారీతిన చేస్తున్న అడ్డగోలు విమర్శలకు పార్లమెంటు సాక్షిగా "కేంద్ర ఆర్థిక సర్వే సంఘం" అడ్డుకట్ట వేసింది,కాళేశ్వరం కూలేశ్వరంగా మారిపోయింది, తెలంగాణ పాలిట గుదిబండగా మారింది, కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణ అప్పుల పాలయ్యింది, కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఆర్ధిక వనరుగా మారింది, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ఉపయోగం లేదు,ఈ ప్రాజెక్టు వలన రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా సాగులోకి రాలేదు,ఒక్క గింజ కూడా అదనంగా ఉత్పత్తి కాలేదని గడిచిన కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న విపక్షాల నోళ్లకు కేంద్ర ఆర్థిక సర్వే సంఘం ఇచ్చిన నివేదికతో తాళాలు పడ్డాయి, కేసిఆర్ కుటుంబం,BRS పార్టీపై నిత్యం విరుచుకుపడే సీఎం.రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు బండి సంజయ్ లాంటివాళ్ళు కేంద్ర ఆర్థిక సర్వే ఇచ్చిన నివేదికపై నోరువిప్పే పరిస్థితులు లేకుండా పోయాయి…..
కాళేశ్వరం ప్రాజెక్టు (ఫైల్ ఫోటో )....
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాజకీయ పార్టీలన్నీ గత కేసీఆర్ ప్రభుత్వంపై చేసిన విమర్శలన్ని పచ్చి అబద్ధాలని కేంద్ర ఆర్థిక సర్వే తేల్చింది,కేంద్ర ఆర్ధిక సర్వే చెప్పిన దాని ప్రకారం 2014 లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సాగు విస్తీర్ణం ఒక కోటి ముప్పై ఒక్క లక్షల ఎకరాలు,2023 నాటికి అంటే తొమ్మిదేళ్ళ కేసీఆర్ పరిపాలనలో తెలంగాణలో మొత్తం సాగు విస్తీర్ణం రెండు కోట్ల ఇరువై మూడు లక్షల ఎకరాలకు పెరిగింది,గతం కంటే రెండింతల సాగు విస్తీర్ణం పెరిగిందనే విషయం గణాంకాలు చెబుతున్నాయి,ఈ గణాంకాలు నా సొంతంగానో లేక ఏ రాజకీయ పార్టీలు చెప్పినవి కాదు,కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్థిక సర్వే స్వయంగా చెప్పిన మాటలు,ఆర్థిక సర్వే ప్రవేశ పెట్టిన అంశాలను బట్టి చూస్తే కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా ఆర్థిక విధ్వంసం జరగలేదు తెలంగాణ రైజింగ్ లోనే ఉంది, కేంద్ర ఆర్థిక సర్వే చెప్పిన దాని ప్రకారం తెలంగాణలో అభివృద్ధి జరిగిందని స్పష్టంగా చెప్పారు కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బిజెపి నాయకులు కూడా అనేక సంవత్సరాలుగా కాళేశ్వరం ఒక వృధా ప్రాజెక్టు అంటూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి......,
కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభిస్తున్న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్,పక్కన నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేందర్ పడనవీస్......
వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఒక లక్షా ముప్పై ఒక్క కోట్ల ఎకరాల సాగు విస్తీర్ణం నుండి రెండు లక్షల ముప్పై ఎకరాలకు పెరగడం కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కారణమని,కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మిషన్ కాకతీయ ఇతర పెద్ద తరహా, చిన్న తరహా ప్రాజెక్టుల నిర్మాణం వల్లనే తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద స్థాయిలో సాగు విస్తీర్ణం పెరిగిందనీ కేంద్ర ఆర్థిక సర్వే సంఘం స్పష్టంగా పేర్కొంది,కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని విపక్షాలు చేసిన విమర్శలు పచ్చి అబద్ధమని ఆర్థిక సర్వే తేల్చింది, మిషన్ కాకతీయ కేవలం డబ్బుల కోసం పెట్టిన పథకంగా విమర్శలు చేసే వాళ్లందరికీ మీ విమర్శలు తప్పని కేంద్ర ఆర్థిక సంఘం మొహం మీద చెప్పేసింది,గతంలో ఎండా కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో చెరువులన్నీ ఎండిపోయి కనీసం పశువుల త్రాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితులను ప్రజలు అనుభవించారు,కానీ కేసీఆర్ మిషన్ కాకతీయ పథకం తీసుకువచ్చిన తరువాత ఎండాకాలంలో కూడా చెరువులు నిండు కుండలను తలపించే విధంగా ఉండడాన్నీ కేసీఆర్ పరిపాలించిన పదేండ్ల పాటు ప్రజలు చూసారు,ఆ కారణంగానే రాష్ట్రంలో భూగర్భ జలాలు అయిదు మీటర్లకు పైగా పెరిగాయని ఆర్థిక సర్వే చెబుతుంది, ప్రధానంగా సాగునీటి రంగానికి సంబంధించి, ఉత్పాదక రంగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందనే విషయం నిన్న పార్లమెంటు సాక్షిగా బయట పడింది,ధాన్యం ఉత్పత్తి అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి 68 లక్షల టన్నులు ఉంటే 2023 నాటికి రెండు కోట్ల డెబ్బై లక్షల టన్నుల ధాన్యం తెలంగాణ రాష్ట్రం నుండి జరిగింది,అంటే దాదాపు నాలుగు రెట్లకు పైగా ధాన్యం ఉత్పత్తిలో వృద్ధిరేటు సాధించింది, దీన్నిబట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం భారత దేశానికి "అన్నపూర్ణ"గా మారిందనే విషయం తేటతెల్లమైంది,దీన్ని బట్టిచూస్తే తెలంగాణలో విధ్వంసం జరగలేదు వికాసం వైపు అడుగులు వేసిందని పూర్తి సాక్ష్యాధారాలతో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కేంద్ర ఆర్థిక సర్వే ఇచ్చిన నివేదికలో స్పష్టం చేసింది,…..
కాలేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం సందర్బంగా గోదావరి తల్లికి చీరే,సారె సమర్పిస్తున్న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్.....
దానితో పాటు సర్వీస్ సెక్టార్, ఐటీ సాంకేతిక రంగాల్లోనే కాకుండా మహిళా సాధికారతలో కూడా తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన పురోగతిని సాధించిందనే విషయం కూడా కేంద్ర ఆర్థిక సర్వే చెప్పింది, ఖచ్చితంగా ఇది కేసీఆర్ ప్రభుత్వాన్ని అభినందించాల్సిన విషయం,దీన్ని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోణంలో చూడాలి తప్ప పార్టీలు,రాజకీయ కోణంలో చూడటం మంచి పరిణామం కాదు,ఇది ప్రతి తెలంగాణా వాది నమ్మాల్సిన విషయం, తెలంగాణ విధ్వంసం కాలేదు,అభివృద్ధి వైపు పయనించింది, దృష్పరచారాలను నమ్మాల్సిన అవసరం లేదని తేలిపోయింది,ఇక మహిళా సాధికారత విషయానికొస్తే మహిళా పారిశ్రామిక వేత్తలకు అవకాశాలను కల్పించడంలో కూడా నాటి కేసిఆర్ ప్రభుత్వం ముందు వరుసలో ఉంది,దీనితో పాటు సర్వీస్ సెక్టార్లో భారత దేశంలోనే టాప్ మోస్ట్ పొజిషన్లో తెలంగాణ రాష్ట్రం నిలబడింది ఆ తరువాత క్రమంలో మహారాష్ట్ర,తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలున్నాయి, ఇక్కడ గర్వించదగిన అంశం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది కానీ సర్వీస్ సెక్టార్లో దేశంలో టాప్ మోస్ట్ పొజిషన్లోకి రావడం తెలంగాణ ప్రజలకు గర్వకారణం,నిజం చెప్పాలంటే భారత దేశాన్ని పోషిస్తున్న నాలుగైదు కీలకమైన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం చేరిందనే విషయం కేంద్ర ఆర్థిక సర్వే సంఘం బయట పెట్టింది….,
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం సందర్బంగా నాటి AP.సీఎం వైయస్. జగన్ మోహన్ రెడ్డి,నాటి మహారాష్ట్ర సియం. దేవేందర్ పడనవీస్,నాటి గవర్నర్ ESL నర్సింహం....
గతంలో కేసీఆర్ అన్నట్లు మేమే ఈ దేశాన్ని పోషిస్తున్నామనే మాట,ఇది కేవలం రాజకీయ నినాదం కాదు కేసీఆర్ మాటలు అక్షర సత్యమనీ కేంద్ర ఆర్థిక సర్వే సంఘం కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది,కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపైన తప్పుడు ప్రచారం చేయడం మానుకోవడం మంచి పద్ధతి,రాష్ట్రానికి మంచి జరిగేలా రాష్ట్రంలో పార్టీలు వ్యవహరించాలి,ప్రభుత్వాలు చేసే తప్పులను విధానపరంగా వ్యతిరేకించాలి తప్పా గుడ్డిగా బురద చల్లడం రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది కాదు,రాజకీయ పార్టీలు,రాజకీయ నాయకులు చేసే విమర్శలు రాష్ట్రంపై కాకుండా విధానపరంగా చేయాలి,పార్టీలుగా కోట్టుకోండి,పార్టీల విధానాలపై విమర్శలు చేసుకోండి కానీ రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదు,రాష్ట్రం విధ్వంసానికి గురవుతుంది,రాష్ట్రం నాశనమై పోతుంది ఈ తరహా విమర్శలు చేయడం మంచి పరిణామం కాదు,ఇప్పటికైనా వాస్తవాలను మరుగున పరచి చేసే విమర్శలు ఎక్కువ కాలం ప్రజల్లో నమ్మకం కలిగించ లేవు అనే విషయం రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు గ్రహిస్తే మంచిది…..
Pathi Srinivasa Rao:9703973456