Janam Muchata – Voice of the People | Telugu News Platformపోన్ ట్యాపింగ్ కేసు ఒక లొట్టపీసు కేసు: కేటీఆర్ › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 12 Aug 2026, 3:03 am
Date of Publish : 23 Jan 2026, 12:48 am  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 1281 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Politics > Rajanna Sircilla > Telangana

పోన్ ట్యాపింగ్ కేసు ఒక లొట్టపీసు కేసు: కేటీఆర్

పోన్ ట్యాపింగ్ కేసు ఒక లొట్టపీసు కేసు: కేటీఆర్

పోన్ ట్యాపింగ్ కేసులో తనకు సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులపై కేటీఆర్ స్పందించారు,రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇదొక లొట్టపీసు కేసు,ఇందులో ఏమి లేదు,హౌలా పనులు బంద్ చేయాలని వ్యాఖ్యానించారు,
పోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్,స్టాండ్ అంటే స్టాండ్ అనే తరహాలో పోలీసులు వ్యవహరిస్తున్నారని కేటీఆర్ తెలిపారు,పోన్ ట్యాపింగ్ కేసు కార్తీక దీపం సీరియల్ మాదిరిగా సాగుతూనే ఉంటుందని,ఇది ఎప్పటికీ ఒడవని,తెగని వ్యవహారంగా పేర్కొన్నారు,అదే విధంగా ప్రభుత్వం స్థిరత్వం కోసం పోలీసులు ఇంటిలిజెన్స్ వ్యవస్థను ఉపయోగించడం, ప్రభుత్వ పెద్దలకు నివేదిక అందించడం సహజమైన వ్యవహారం,ఇది రొటీన్ గా పోలీసులు నిర్వహించే ప్రక్రియ అని కేటీఆర్ అనడం గమనార్హం…….

ప్రస్తుత ప్రభుత్వంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి పోన్లు ట్యాప్ అవుతున్నాయని జర్నలిస్టులు వార్తలు వ్రాస్తే ప్రభుత్వం ఇంతవరకు ఖండించలేదు, మంత్రులు, ఎమ్మెల్యేలు,విపక్ష సభ్యుల ఫోన్లు ట్యాప్ చేయడం లేదని రాష్ట్ర డీజీపీ, ఇంటిలిజెన్స్ డీజీ ప్రమాణం చెప్పగలుతారా అని కేటీఆర్ ప్రశ్నించారు, రేవంత్ రెడ్డి పదిరోజుల దావోస్ పర్యటన నుండి ప్రజల మైండ్ డైవర్ట్ చేయడం కోసం ఆడే డ్రామా తప్ప ఈ కేసులో పస లేదు,ఇదొక బక్వాస్ కేసు,ఈ విషయం ఈ కేసును విచారణ చేస్తున్న పోలీసులకు కూడా తెలుసు,ఈ రోజు ఈ కేసులో అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్న పోలీసు అధికారులపై మేము అధికారంలోకి రాగానే విచారణ చేపడితే ఇబ్బందుల పాలయ్యేది,నష్టపోయేది అధికారులేనని,రాజకీయ క్రీడలో అధికారులు బలి పశువులు కావొద్దని పోలీసులకు హితవు పలికారు….

నేను ఎపుడు తప్పు చేయలేదు, ఎవని అయ్యకు భయపడేది లేదన్నారు,రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకాక,ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టిని మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు దానిలో భాగంగా కాళేశ్వరం కుంభకోణం,పోన్ ట్యాపింగ్ అంటూ,గొర్రెల స్కాం, ఫార్ములా ఈ కుంభకోణం అంటూ రెండేళ్లుగా లొట్టపీసు కేసులు,నోటీసుల పేరుతో అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు ఆడటం తప్ప రేవంత్ రెడ్డి సాధించింది ఏమిటని సూటిగా ప్రశ్నించారు….

రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న బొగ్గు కుంభకోణంపై ఆధారాలతో ఉదయం హరీష్ రావు బయట పెడితే సాయంత్రానికి పోలీసులు పోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు,మేము సింగరేణి బొగ్గు కుంభకోణం బయటపెట్టి సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తే,రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణకు ఆదేశిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదం,దొంగ ఎక్కడన్న నేను దొంగతనం చేసినా నా మీద విచారణ చేయండి అని అడుగుతాడా,ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరి అసహ్యంగా,ఎబ్బెట్టుగా ఉందనీ కేటీఆర్ పేర్కొన్నారు….

అంతే కాకుండా అమృత్ పథకం పనుల్లో రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డి కంపెనీకి అర్హత లేకపోయినా కాంట్రాక్టులు దక్కించుకున్నారో ఆధారాలతో స్వయంగా కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రికి ఇచ్చాను దాని మీద సిట్ వేయండి,కంచె గచ్చిబౌలి భూముల్లో పదివేల కోట్ల కుంభకోణం జరిగిందంటూ దీని మీద విచారణ జరిపించండి అంటూ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఎంపవర్మెంట్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తే ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు,రేవంత్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు, ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో ఆర్.ఆర్ (రాహుల్, రేవంత్) టాక్స్ నడుస్తుందంటారు,కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలా మారిందంటారు,వీటి మీద సిట్ ఎందుకు వేయడం లేదు,కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వీటి మీద విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు….

అదేవిధంగా నాడు ప్రజా సౌలభ్యం కోసం కేసీఆర్ శాస్త్రీయబద్ధంగా జిల్లాలు ఏర్పాటు చేస్తే నేడు రేవంత్ రెడ్డి వీటికి శాస్త్రీయత లేదంటూ రద్దు చేసి కేసిఆర్ ఆనవాళ్లను తుడిచేద్దామనుకుంటే ప్రజల చేతుల్లో చావు దెబ్బ తప్పదని,ఇలాంటి తుగ్లక్ పనులు మానుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ హెచ్చరించారు…