Janam Muchata – Voice of the People | Telugu News Platform › దావోస్ ఆర్థిక సదస్సులో మంత్రి పొంగులేటి బిజీ బిజీ!! › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 ✈ in @ ✉
janammuchata.in 10 Oct 2026, 8:12 pm
Date of Publish : 20 Jan 2026, 11:13 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 316 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > State Politics > Telangana

దావోస్ ఆర్థిక సదస్సులో మంత్రి పొంగులేటి బిజీ బిజీ!!

దావోస్ ఆర్థిక సదస్సులో మంత్రి పొంగులేటి బిజీ బిజీ!!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి దావోస్ లో జరుగుతున్న WEF 2026 సమ్మిట్ కీ వెళ్ళిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వివిధ కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడిపారు,తొలుత యూనిలీవర్ చీఫ్ సప్లై చైన్ & ఆపరేషన్స్ ఆఫీసర్ విల్లెం ఉయిజెన్‌తో సమావేశమయ్యారు,హైదరాబాద్‌ నగరంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటు చేసే అవకాశంపై చర్చించారు,ఈ సమావేశంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం హైదరాబాద్ ఒక ప్రముఖ GCC కేంద్రంగా వేగంగా ఎదుగుతున్న తీరును పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించింది,తెలంగాణ పారిశ్రామిక పార్కులలో ఎఫ్‌ఎంసిజి తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని కూడా యూనిలీవర్‌ను ఆహ్వానించడం జరిగింది,యూనిలీవర్ కంపెనీ సానుకోలంగ స్పందించిందని, హైదరాబాద్ నగరంలో యూలివర్ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని కనబర్చిందని మంత్రి పొంగులేటి తెలిపారు…..

ఆ తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచర మంత్రులు,రైజింగ్ ప్రతినిధి బృందం గూగుల్ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ శ్రీ సంజయ్ గుప్తాతో ఉన్నత స్థాయి చర్చలు జరిపింది,ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం యొక్క CURE, PURE & RARE అభివృద్ధి నమూనాలు మరియు ప్రాంతీయ ఆర్థిక వృద్ధిని నడిపిస్తున్న కీలక కార్యక్రమాల గురించి వివరించారు,హైదరాబాద్‌లో తమ మొదటి 'గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్'ను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గూగుల్‌కు ధన్యవాదాలు తెలిపారు,గూగుల్ APAC ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా మాట్లాడుతూ ట్రాఫిక్ నిర్వహణ, సైబర్‌సెక్యూరిటీ, వ్యవసాయం,స్టార్టప్‌లతో సహా వివిధ రంగాలలో తెలంగాణకు గూగుల్ మద్దతు ఎపుడు ఉంటుందని హామీ ఇచ్చారు….

ఆ తరువాత UAE ఆర్థిక మరియు పర్యాటక శాఖ మంత్రి హెచ్.ఈ.అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో కీలక సమావేశం నిర్వహించారు,సుమారు 30,000 ఎకరాలలో విస్తరించి ఉన్న భారత్ ఫ్యూచర్ సిటీని భారతదేశపు మొట్టమొదటి నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని, ఇందులో ఏఐ, విద్య, ఆరోగ్య సంరక్షణ, పరిశ్రమలు, నివాస మరియు వినోద రంగాల కోసం ప్రత్యేక జోన్‌లు ఉన్నాయని యూఏఈ మంత్రికి వివరించారు,మారుబెని మరియు సెమ్‌కార్ప్ వంటి అంతర్జాతీయ కంపెనీల భాగస్వామ్యం గురించి,అలాగే ఫ్యూచర్ సిటీలో కొత్త జూను ఏర్పాటు చేయడానికి రిలయన్స్ గ్రూప్‌కు చెందిన వంతరాతో ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు….

ఈ సమావేశంలో భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయడానికి తెలంగాణతో కలిసి పనిచేయడానికి యూఏఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని యూఏఈ మంత్రి తెలియజేశారు,2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వ 'తెలంగాణ రైజింగ్ 2047' దార్శనికతను యూఏఈ మంత్రి అభినందించారు,హెచ్.ఈ.అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవడం ఆసక్తిని కనబరిచారు,ఈ ప్రాజెక్టును వేగవంతం చేయడానికి ఇరు ప్రభుత్వాల అధికారులతో కూడిన ఒక సంయుక్త టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు,అంతే కాకుండా రాష్ట్రంలోని గ్రామీణ మరియు వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుపై ఆసక్తి కనబరిచారని ముఖ్యమంత్రి బృందం తెలిపింది…..