ఖమ్మం జిల్లా: Jan:20:1:2026
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు బిఆర్ఎస్ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విద్వేషపూరిత,హింసను ప్రేరేపించే వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ,ఈ మేరకు పార్టీ ముఖ్య నాయకులుతో కూడిన ప్రతినిధి బృందం ఈరోజు ఖమ్మం పోలీస్ కమిషనర్‌ను కలిసి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదును చేయడం జరిగింది…..
గత జనవరి 18న ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీని వంద మీటర్ల గోతి తీసి పాతిపెట్టాలని, గ్రామాల్లో బిఆర్ఎస్ దిమ్మలను కూల్చివేయాలని బహిరంగంగా పిలుపునిచ్చిన మాట అందరికీ విధితమే,ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే కాదని,ఇవి ప్రత్యర్థి పార్టీపై భౌతిక దాడులను ప్రేరేపించేలా ఉన్నాయని బి.ఆర్.యస్ పార్టీ బృందం పోలీసు కమిషనర్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాష్ట్ర అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి "పాతిపెట్టాలి", "కూల్చివేయాలి" వంటి హింసాత్మక పదజాలాన్ని వాడటం వల్ల క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు రెచ్చిపోయి దాడులకు పాల్పడే అవకాశం ఉందని, ఇది రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణతకు దారితీస్తుందని బిఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఒక రాజకీయ పార్టీని భౌతికంగా తుడిచిపెట్టాలని పిలుపునివ్వడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, ఇది ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నమని ప్రతినిధి బృందం పేర్కొంది,తెలంగాణ రాష్ట్ర సాధనలో మరియు అభివృద్ధిలో చారిత్రాత్మక పాత్ర పోషించిన శ్రీ కేసీఆర్ గారిపై విద్వేషాన్ని వెళ్లగక్కడం, లక్షలాది మంది పార్టీ శ్రేణుల మనోభావాలను దెబ్బతీయడమేనని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ రెచ్చగొట్టే ప్రసంగంపై తక్షణమే FIR నమోదు చెయ్యాలని కోరారు….
ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ మండల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు ఉప్పల వెంకటరమణ, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మక్బూల్, మాజీ జిల్లా లైబ్రరీ చైర్మన్ ఖమర్, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు తాజుద్దీన్, సీనియర్ నాయకులు పోట్ల శ్రీనివాస్, నాయకులు ముత్యాల వెంకటప్పారావు, ఉద్యమకారులు పగడాల నరేందర్, నాయకులు సద్దాం షేక్, సర్పంచ్ ఆర్మీ రవి, బలుసు మురళీ కృష్ణ, మొహమ్మద్ రఫీ మరియు తదితరులు పాల్గొన్నారు….
Pathi Srinivasa Rao: 9703973456