Janam Muchata – Voice of the People | Telugu News Platform › రేవంత్ రెడ్డి ఎన్ని డ్రామాలు చేసినా వదిలేది లేదు: హరీష్… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 ✈ in @ ✉
janammuchata.in 10 Oct 2026, 10:07 pm
Date of Publish : 20 Jan 2026, 11:47 am  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 306 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Politics > Telangana

రేవంత్ రెడ్డి ఎన్ని డ్రామాలు చేసినా వదిలేది లేదు: హరీష్ రావు

రేవంత్ రెడ్డి ఎన్ని డ్రామాలు చేసినా వదిలేది లేదు: హరీష్ రావు

మాజీమంత్రి హరీష్ రావుకు పోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొరకు ఈ రోజు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో హరీష్ రావు ఇంటినుండి కేటీఆర్ తో కలిసి బారీ కాన్వాయ్ తో తెలంగాణ భవన్ కు చేరుకున్నారు,ఈ సందర్భంగా బి.ఆర్.యస్ కార్యకర్తలు కేటీఆర్,హరీష్ రావులకు బారి ఎత్తున స్వాగతం పలికారు ఈ క్రమంలో తెలంగాణ భవన్ ముందు పోలీసులు కాసేపు హైడ్రామాకు తెరలేపారు,హరీష్ రావుకు మద్దతుగా బారీగా తరలి వచ్చిన కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో బి.ఆర్.యస్ కార్యకర్తలు తిరగబడడంతో పోలీసులు వెనక్కు తగ్గారు…..

తెలంగాణ భవన్ నుండి జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి బయలుదేరిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కాసేపు మీడియాతో మాట్లాడారు,రేవంత్ రెడ్డి బావమరిది బాగోతాన్ని ఉదయం బయట పెట్టినందుకు, నాకు రాత్రి నోటీసులు పంపాడు,నిన్న రాత్రి 9 గంటలకు నోటీసులు ఇచ్చి ఉదయాన్నే 11 గంటల వరకు విచారణకు రమ్మన్నారు,ఆ సమయంలో నేను సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నాను అయినా రాత్రికి రాత్రి హైదరాబాద్ చేరుకొని, ఇప్పుడు వారి నోటీసులపై విచారణకు హాజరు అవుతున్నానని అన్నారు,మేము ఏ తప్పు చేయలేదు,భయపడము,చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది,నీ తాటాకు చప్పుళ్లకు బి.ఆర్.యస్ పార్టీ భయపడదు,నీకు దిమ్మ తిరిగే విధంగా మున్సిపల్ ఎన్నికల్లో తీర్పు ఇవ్వబోతున్నారు బిడ్డా జాగ్రత్త అంటూ సీఎం.రేవంత్ కు హెచ్చరిక జారీ చేశారు, నువ్వెన్ని నోటీసులు ఇచ్చినా,ఎన్ని డైవర్షన్లు చేసినా నీ బొగ్గు స్కాం,పవర్ స్కాం, హిల్ టీపి స్కాం బయటపెట్టి తీరుతాం, చంద్రబాబు నాయుడుకు అమ్ముడుపోయిన సంగతి కూడా ప్రజల ముందు పెడతామని హరీశ్ రావు సీరియస్ వ్యాఖ్యలు చేశారు,రేవంత్ రెడ్డి కుంభకోణాలు,వాటాల పంచాయతీలు ప్రజలకు అర్థం అవుతుందని డైవర్షన్ కోసం మాకు నోటీసులు ఇస్తున్నారని,ఎన్నికలు ఉన్నప్పుడు మా పార్టీ నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారని అదేవిధంగా పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారని ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయని నాకు నోటీసులు ఇచ్చారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు….

గతంలో రేవంత్ రెడ్డి నా మీద ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టేశాయి,నీ చెంప చెల్లుమనే లాగా తీర్పు ఇచ్చాయి,అయినా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదో ఉందని రెండేళ్ల నుండి డ్రామా ఆడుతున్నావు,సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత కూడా నీ డ్రామాలు ఏంది? నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా నిన్ను వదిలేది లేదు..నీ కుంభకోణాల గురించి నిలదీస్తూనే ఉంటామనీ సీఎం. రేవంత్ రెడ్డిని హెచ్చరించారు…