Janam Muchata – Voice of the People | Telugu News Platform › వెలకట్టలేని త్యాగాలకు ప్రతీకలు సమ్మక్కసారలమ్మలు: మంత్రి పొంగులేటి! › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 ✈ in @ ✉
janammuchata.in 12 Oct 2026, 2:44 am
Date of Publish : 19 Jan 2026, 5:05 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 203 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mulugu > Telangana

వెలకట్టలేని త్యాగాలకు ప్రతీకలు సమ్మక్కసారలమ్మలు: మంత్రి పొంగులేటి!

వెలకట్టలేని త్యాగాలకు ప్రతీకలు సమ్మక్కసారలమ్మలు: మంత్రి పొంగులేటి!

ఈ నెల 28 తారీఖున ప్రారంభమయ్యే అడవిబిడ్డల ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపాలు,ఆదివాసి గిరిజనులకు ఆరాధ్య దైవం అయిన ,గుడి లేని దేవతలు,భక్తుల గుండెలో కొలువై,కోట్లాది భక్తులకు కొంగు బంగారమైన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా, అత్యంత వైభవోపేతంగా 251 కోట్ల నిధులతో చేపట్టిన మేడారం జాతర శాశ్వత పునర్నిర్మాణ పనులు, పూర్తయిన సందర్భంగా రాతి నిర్మాణాలతో చేసిన శిలాఫలకాలను (పైలాన్ ) ఆవిష్కరణ మరియు జాతర ప్రాంగణ అభివృద్ధి కార్యక్రమాలను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించారు, దీంతో తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అద్భుతమైన ఘట్టం,ఒక అరుదైన సందర్భం,ఈరోజు మేడారం వేదికగా ఆవిష్కృతం అయింది….

ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ శ్రీ సమ్మక్క సారలమ్మ వార్ల జాతర అభివృద్ధి పనులను పూర్తి చేసే గొప్ప కార్యక్రమం నిర్వహించే బాధ్యత నాకు లభించడం నా అదృష్టం,అమ్మవార్ల దయగా భావిస్తున్నానని,మేడారం అభివృద్ధి పనులపై ప్రత్యేక బాధ్యత అప్పగించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలపుకుంటూ,సహచర మంత్రులు సహకారం, అధికారులు కనబర్చిన పనితీరు గొప్పది,గిరిజన కుల పెద్దలు, స్థానిక ప్రజలు, భక్తులు సహకరించిన తీరు అభినందనీయమని,అదేవిధంగా తెలంగాణ చరిత్రలోనే తొలిసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ సన్నిధానంలో మంత్రిమండలి నిర్వహించి ఒక కొత్త చరిత్రకు నాంది పలికారని అన్నారు….

అదే విధంగా యావత్ రాష్ట్ర మంత్రివర్గం, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు అందరూ ఆదివారం రాత్రి మేడారంలోనే బస చేసి, అనంతరం ఈరోజు ఉదయాన్నే పూజారుల సమక్షంలో శ్రీ సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకోవడం జరిగింది.ఈ పూజా కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు…..