ఖమ్మం జిల్లా:Jan11:1:2026
ఆన్‌లైన్ మోసాల ముఠాలు సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకొని లక్షల రూపాయలు కొల్లగొడుతున్నాయి.ఫోన్ కాల్స్, నకిలీ లింకులు, ఫేక్ యాప్‌ల ద్వారా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు బాధితులను తీవ్ర ఆర్థిక, మానసిక వేదనకు గురిచేస్తున్నారు,ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్తుపల్లి సైబర్ క్రైమ్ ముఠా పోలీసు విచారణ తరువాత కమీషనర్ చెప్పిన వివరాల ప్రకారం అక్షరాల 547 కోట్లు దోపిడి చేశారు,తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ ముఠాపై వందలాది కేసులు నమోదైనట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వెల్లడించారు….
అసలు నేరస్థులు పోట్రు మనోజ్ కళ్యాణ్,ఉడతనేని వికాస్ చౌదరి,పోట్రు ప్రవీణ్, మేడా భాను ప్రియ,మేడా సతీష్,మోరంపూడి చెన్న కేశవల్లో ఒక్క పోట్రు ప్రవీణ్ తప్ప మిగతా నేరస్తులంతా పోలీసుల కండ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్నారు,వీరిలో వికాస్ చౌదరి అనే సైబర్ నేరగానికి ముఖ్యమంత్రి లెవల్లో చక్రం తిప్పగలిగిన ఓ అధికార పార్టీ నాయకునికి దగ్గర బంధువు కావడంతో నేరస్తుల అరెస్ట్ పై నీలి నీడలు కమ్ముకున్నాయని,అందుకే అరెస్ట్ విషయంలో జాప్యం జరుగుతుందని ప్రజల్లో చర్చ జరుగుతున్నప్పటికీ,నిజాయితీ గల ఆఫీసర్ గా పేరు సంపాదించుకున్న ఖమ్మం పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుండడంతో వాళ్ళ ఆటలు సాగడంలేదనే వాదన కూడా వినిపిస్తుంది….
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి కేసుల పాలైన నిందితులు….
ఈ మొత్తం వ్యవహారంలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి ఈ రోజు అరెస్ట్ కాబడిన నిందితులంతా,వాళ్ళు ఇచ్చే వేయి,రెండు వేలకు ఆశపడి సైబర్ నేరగాళ్ల ఏజెంట్ల మాటలు నమ్మి జీవితాలను ఆగం చేసుకున్న రెక్కాడితే గాని డొక్కాడని అమాయకులే,వారి అవసరాలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు విసిరిన విష వలయంలో చిక్కి బలై పోయిన కటిక పేదవాళ్లే ,కానీ తెలిసి చేసినా తెలియక చేసినా నేరం,నేరమే కాబట్టి చట్టం ముందు అందరూ సమానమే,మానవీయ కోణంలో ఆలోచిస్తే వీళ్ళ అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళకు బ్యాంక్ ఎకౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళు దోచుకున్న సొత్తును వీళ్ల ఏకౌంట్లలోకి మళ్ళించి వీరికి తెలియకుండానే వాళ్ళు చేసిన నేరాల్లో అభం,శుభం తెలియని అమాయకులను భాగస్వాములను చేశారు,వీళ్ళను కేసుల్లో ఇరికించారు,అసలు నేరం చేసిన నేరగాళ్లు చట్టానికి దొరకకుండా తప్పించుకుని తిరుగుతుంటే,తెలిసి,తెలియక చేసిన పాపానికి వీళ్ళు మాత్రం జైలు ఊసలు లెక్కించాల్సిన పరిస్థితి వచ్చింది….
ఒక విధంగా చెప్పాలంటే సైబర్ నేరగాళ్లు మందిని ముంచి సంపాదించిన వందల కోట్ల రూపాయలతో, రాజకీయ అండదండలతో ఏదో విధంగా వ్యవస్థల్లో ఉన్న లోపాలను అడ్డం పెట్టుకుని కేసుల నుండి బయటపడే అవకాశం ఉంది,కానీ తెలుసో తెలియకో చేసిన తప్పులకు కేసుల పాలైన,కష్టపడి కూలి,నాలి చేసుకుని బ్రతికే అమాయకుల పరిస్థితి ఏమిటి? అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల్లో నమోదైన కేసులను వందలాది కేసులను వీరు ఏవిధంగా ఎదుర్కోగలుగుతారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది,ఇది ఇలా ఉంటే "సైబర్ నేరగాళ్ల" ఉచ్చులో చిక్కుకుని జైలు పాలైన సామాన్యులు ఇంతకు నిందితులా,బాదితులా అనే విషయం అంతు చిక్కని అయోమయ పరిస్థితి నెలకుంది….
Pathi Srinivasa Rao : 9703973456